Rohit Sharma: కోహ్లీ రికార్డును దాటేసిన రోహిత్ శర్మ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సారథిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలి వన్డే సిరీస్‌లోనే రోహిత్ శర్మ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. భారత్‌లో వన్డేల్లో విండీస్‌ను వైట్‌వాష్ చేసిన మొట్టమొదటి కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. తన తొలి వన్డే సిరీస్‌నే క్లీన్‌స్వీప్ చేయడమే కాకుండా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ నెలకొల్పిన ఓ రికార్డును అధిగమించాడు. రోహిత్ ఇప్పటివరకు 13 వన్డేలకు కెప్టెన్సీ వహించగా 11 మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించింది. దీంతో ఇండియా తరఫున కోహ్లీ నెలకొల్పిన 13 మ్యాచ్‌ల్లో 10 విజయాల రికార్డును రోహిత్ శర్మ దాటేశాడు. ఓవరాల్‌గా 13 మ్యాచ్‌ల్లో 12 విజయాలతో క్లైవ్ లాయిడ్ (వెస్టిండీస్), ఇంజమామ్ (పాకిస్థాన్) తొలి స్థానంలో ఉన్నారు.
అటు ఓ వన్డే సిరీస్‌లో వెస్టిండీస్‌లో వైట్ వాష్ చేయడం భారత్‌కు ఇదే తొలిసారి. స్వదేశంలో టీమిండియాకు ఇది 12వ వైట్‌వాష్ సిరీస్ కావడం విశేషం. టీమిండియా గడ్డపై ఇప్పటివరకు శ్రీలంక, న్యూజిలాండ్, జింబాబ్వే, ఇంగ్లండ్ జట్లు వైట్‌వాష్ అయ్యాయి. తాజాగా ఈ జాబితాలో వెస్టిండీస్ చేరింది. ఓవరాల్‌గా వెస్టిండీస్ జట్టుకు వన్డేల్లో ఇది 20వ వైట్ వాష్. కాగా 2014లో స్వదేశంలో శ్రీలంకతో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను 5-0 తో టీమిండియా క్లీన్‌స్వీప్ చేయడం చేసింది. మళ్లీ ఏడేళ్ల తర్వాత టీమిండియా స్వదేశంలో వన్డేల్లో ఒక జట్టును క్లీన్‌స్వీప్ చేసింది.
Also Read
- Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
- Kohli 55th Century: రికార్డులే దాసోహమైన వేళ.. విరాట్ కోహ్లీ వీరవిహారం.. పలు రికార్డులు బద్దలు..
- Rothit Sharma: రోహిత్ శర్మ కట్ అవుట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాల్సిందే డూడ్..
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?