వీధు కుక్కలు సరేసరి.. వాటి ఇష్టారాజ్యం.. కానీ, పెంపుడు కుక్కలు రోజుకు ఒకసారి లేదా రెండు మూడుసార్లు బయటకు తిప్పడం మళ్లీ ఇంట్లో పెట్టడం చేస్తుంటారు.. అయితే, ఏమైందో..? ఎక్కడి నుంచి వచ్చిందో కానీ.. ఓ శునకం ఎయిర్పోర్ట్లోప్రత్యక్షమైంది.. రన్వేపై పరుగులు పెడుతూ.. ఎయిర్పోర్ట్ సిబ్బందికి చుక్కలు చూపించింది.. దీనికి సంబంధించిన వీడియోను చిత్రీకరించిన ఓ వ్యక్తి.. సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. అది కాస్తా వైరల్గా మారిపోయింది. ఎయిర్పోర్ట్లో పరుగులు పెట్టడమే కాదు.. లక్షల్లో వ్యూస్..…
సత్యసాయి జిల్లా చిలమత్తూరు పోలీస్ స్టేషన్లో ఓ ఎస్సై రెచ్చిపోయాడు. ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వచ్చిన ఓ యువకుడిని చితకబాదాడు. దీంతో ఎస్సై దాడి చేసిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వివరాల్లోకి వెళ్తే.. తన తల్లి వికలాంగురాలు అని.. ఆమెకు వికలాంగురాలి పెన్షన్ మంజూరు చేపిస్తానని చెప్పి స్థానిక వైసీపీ నేత దామోదర్ రెడ్డి డబ్బు తీసుకుని మోసం చేశాడని బాధితుడు వేణు ఆరోపించాడు. వైసీపీ నేత దామోదర్ రెడ్డిని ప్రశ్నించేందుకు వెళ్లిన…
బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇక ఇటీవల విజయ్ దేవరకొండ, పూరి కాంబోలో తెరకెక్కుతున్న లైగర్ సినిమాలో నటిస్తూ మరింత ఫేమస్ అయ్యాడు. తాజాగా ఈ బాక్సింగ్ లెజెండ్ విమానంలో తోటి ప్రయాణికుడిపై పిడిగుద్దులతో విరుచుకుపడ్డాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఒక వ్యక్తి.. విమానంలో మైక్ టైసన్ ను చూసి అత్యుత్సాహ పడి.. అతనిని తన కెమెరాలో…
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అలాంటిది భారత్లో పాకిస్థాన్ జిందాబాద్ అనే నినాదం వినిపిస్తే ఇంకేమైనా ఉంటుందా? కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితే నెలకొంది. ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లాలో సింఘై కలాన్ గ్రామంలో ఓ వ్యక్తి తన షాపులో ‘పాకిస్తాన్ జిందాబాద్’ పాట ప్లే చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోను చూసిన బీజేపీ నేతలు భూటా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఇద్దరు నిందితులపై పోలీసులు…
శ్రీకాకుళం జిల్లాలో విచిత్రం చోటు చేసుకుంది. కంచిలి మండలం జడిపుడి గ్రామంలో జామి ఎల్లమ్మ ఆలయంలో సోమవారం రాత్రి ఓ వ్యక్తి దొంగతనానికి వెళ్లాడు. పొరుగు గ్రామానికి చెందిన పాపారావు అనే వ్యక్తి ఆలయంలో చోరీకి ప్రయత్నించాడు. తొలుత అతడు గోడకు ఓ వైపున చిన్న రంధ్రం పెట్టి గుడిలోకి ప్రవేశించాడు. అయితే గుడి లోపలకు బాగానే వెళ్లిన దొంగ.. హుండీలో కానుకలు, అమ్మవారి నగలు దొంగతనం చేసి బయటకు మాత్రం రాలేకపోయాడు. తిరిగి వస్తూ అతడు…
మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. ఆయన ఎప్పుడూ మోటివేషనల్ వీడియోలను షేర్ చేస్తుంటారు. తాజాగా ఆయన ఓ వీడియో పోస్ట్ చేశారు. సదరు వీడియోలో తమకు దొరికిన ఆహారాన్ని పిల్లి వచ్చి తింటుండగా.. ఒక కాకి పిల్లిని తన ముక్కుతో గుచ్చగా ఆ కాకితో పిల్లి ఫైట్ చేస్తుండగా.. మరో కాకి వచ్చి ఆ ఆహారాన్ని తీసుకువెళ్లిపోతుంది. దీంతో కష్టాలు వచ్చిన సమయంలో ఎలా పోరాడాలో కాకులను చూసి…
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ రణరంగాన్ని తలపించింది. సోమవారం నాడు సభలో అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష పార్టీ బీజేపీ ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. పిడిగుద్దుల వర్షం కురిపించుకున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలపై సీఎం మమతా బెనర్జీ ప్రకటన చేయాలని బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేయడంతో ఈ వివాదం మొదలైంది. ముఖ్యంగా బీర్బూమ్ ఘటనపై సీఎం మమత మాట్లాడాలని బీజేపీ నేతలు పట్టుబట్టడం టీఎంసీ ఎమ్మెల్యేలకు ఆగ్రహాన్ని తెప్పించింది. ఇటీవల బీర్బూమ్లో టీఎంసీ నేత…
ఇటీవల సోషల్ మీడియాలో వుడెన్ ట్రెడ్ మిల్ తెగ వైరల్ అవుతోంది. ఎక్కడ చూసినా దీని గురించే నెటిజన్లు చర్చించుకుంటున్నారు. సహజంగా ఇంట్లోనే ఉండి వ్యాయమం చేసే పరికరాల్లో ముఖ్యమైనది ట్రెడ్మిల్. ఇది నడక, జాగింగ్, రన్నింగ్ వంటి వాటిని బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండి చేసుకునే అత్యుత్తమ పరికరం. ఇలాంటి పరికరాన్ని ఓ వ్యక్తి ఇనుము, ఇతర లోహాలతో కాకుండా కేవలం చెక్కతో తయారు చేశాడు. ఈ వుడెన్ ట్రెడ్ మిల్ను తయారుచేసిన వ్యక్తిని అందరూ…
19 ఏళ్ల వయసులో సాధారణంగా ఎవరైనా కాలేజీ చదువుతో లేదంటే ఖాళీ దొరికితే స్నేహితులతో కలసి షికార్లు కొడుతుంటారు. కానీ 19 ఏళ్ల కుర్రాడు ప్రదీప్ మెహ్రా అలా కాదు. చిన్న వయసుకే బాధ్యతలు తెలిసినవాడు. ఉత్తరాఖండ్లోని పల్మోరాకు చెందిన ఈ బాలుడు నోయిడాలోని సెక్టార్ 16లో మెక్ డొనాల్డ్స్ రెస్టారెంట్లో పనిచేస్తుంటాడు. పొద్దున వెళితే.. అర్ధరాత్రి వరకు డ్యూటీ. దీంతో రాత్రి విధులు ముగిసిన తర్వాత 10 కిలోమీటర్ల దూరంలోని బరోలాలో ఉన్న తన ఇంటి…
అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా మేనియా ఇంకా తగ్గలేదు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే చాలా మంది పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చేసిన తగ్గేదేలే మేనరిజాన్ని ఇమిటేట్ చేస్తూ సోషల్ మీడియాలో రీల్స్ చేస్తున్నారు. ఇటీవల క్రికెటర్ రవీంద్ర జడేజా శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్లో తగ్గేదే లే అంటూ బన్నీ మేనరిజాన్ని ఇమిటేట్ చేయగా ఆ వీడియో తెగ వైరల్ అయ్యింది. తాజాగా శ్రీలంకతో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ…