శ్రీకాకుళం జిల్లాలో విచిత్రం చోటు చేసుకుంది. కంచిలి మండలం జడిపుడి గ్రామంలో జామి ఎల్లమ్మ ఆలయంలో సోమవారం రాత్రి ఓ వ్యక్తి దొంగతనానికి వెళ్లాడు. పొరుగు గ్రామానికి చెందిన పాపారావు అనే వ్యక్తి ఆలయంలో చోరీకి ప్రయత్నించాడు. తొలుత అతడు గోడకు ఓ వైపున చిన్న రంధ్రం పెట్టి గుడిలోకి ప్రవేశించాడు. అయితే గుడి లోపలకు బాగానే వెళ్లిన దొంగ.. హుండీలో కానుకలు, అమ్మవారి నగలు దొంగతనం చేసి బయటకు మాత్రం రాలేకపోయాడు. తిరిగి వస్తూ అతడు…
మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఆయన ఎప్పుడూ మోటివేషనల్ వీడియోలను షేర్ చేస్తుంటారు. తాజాగా ఆయన ఓ వీడియో పోస్ట్ చేశారు. సదరు వీడియోలో తమకు దొరికిన ఆహారాన్ని పిల్లి వచ్చి తింటుండగా.. ఒక కాకి పిల్లిని తన ముక్కుతో గుచ్చగా ఆ కాకితో పిల్లి ఫైట్ చేస్తుండగా.. మరో కాకి వచ్చి ఆ ఆహారాన్ని తీసుకువెళ్లిపోతుంది. దీంతో కష్టాలు వచ్చిన సమయంలో ఎలా పోరాడాలో కాకులను చూసి…
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ రణరంగాన్ని తలపించింది. సోమవారం నాడు సభలో అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష పార్టీ బీజేపీ ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. పిడిగుద్దుల వర్షం కురిపించుకున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలపై సీఎం మమతా బెనర్జీ ప్రకటన చేయాలని బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేయడంతో ఈ వివాదం మొదలైంది. ముఖ్యంగా బీర్బూమ్ ఘటనపై సీఎం మమత మాట్లాడాలని బీజేపీ నేతలు పట్టుబట్టడం టీఎంసీ ఎమ్మెల్యేలకు ఆగ్రహాన్ని తెప్పించింది. ఇటీవల బీర్బూమ్‌లో టీఎంసీ నేత…
ఇటీవల సోషల్ మీడియాలో వుడెన్ ట్రెడ్ మిల్ తెగ వైరల్ అవుతోంది. ఎక్కడ చూసినా దీని గురించే నెటిజన్లు చర్చించుకుంటున్నారు. సహజంగా ఇంట్లోనే ఉండి వ్యాయమం చేసే పరికరాల్లో ముఖ్యమైనది ట్రెడ్మిల్. ఇది నడక, జాగింగ్, రన్నింగ్ వంటి వాటిని బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండి చేసుకునే అత్యుత్తమ పరికరం. ఇలాంటి పరికరాన్ని ఓ వ్యక్తి ఇనుము, ఇతర లోహాలతో కాకుండా కేవలం చెక్కతో తయారు చేశాడు. ఈ వుడెన్ ట్రెడ్ మిల్‌ను తయారుచేసిన వ్యక్తిని అందరూ…
19 ఏళ్ల వయసులో సాధారణంగా ఎవరైనా కాలేజీ చదువుతో లేదంటే ఖాళీ దొరికితే స్నేహితులతో కలసి షికార్లు కొడుతుంటారు. కానీ 19 ఏళ్ల కుర్రాడు ప్రదీప్ మెహ్రా అలా కాదు. చిన్న వయసుకే బాధ్యతలు తెలిసినవాడు. ఉత్తరాఖండ్‌లోని పల్మోరాకు చెందిన ఈ బాలుడు నోయిడాలోని సెక్టార్ 16లో మెక్ డొనాల్డ్స్ రెస్టారెంట్లో పనిచేస్తుంటాడు. పొద్దున వెళితే.. అర్ధరాత్రి వరకు డ్యూటీ. దీంతో రాత్రి విధులు ముగిసిన తర్వాత 10 కిలోమీటర్ల దూరంలోని బరోలాలో ఉన్న తన ఇంటి…
అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా మేనియా ఇంకా తగ్గలేదు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే చాలా మంది పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చేసిన తగ్గేదేలే మేనరిజాన్ని ఇమిటేట్ చేస్తూ సోషల్ మీడియాలో రీల్స్ చేస్తున్నారు. ఇటీవల క్రికెటర్ రవీంద్ర జడేజా శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో తగ్గేదే లే అంటూ బన్నీ మేనరిజాన్ని ఇమిటేట్ చేయగా ఆ వీడియో తెగ వైరల్ అయ్యింది. తాజాగా శ్రీలంకతో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ…
హైదరాబాద్ నగరంలో రోడ్ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎప్పుడూ రద్దీగానే ఉంటాయి. అయితే కొంతమంది ఆకతాయిలు రోడ్డుపై వెళ్లేవారిని భయపెట్టేందుకు ఆటోలతో ప్రమాదకర విన్యాసాలను చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో కొందరు యువకులు ఆటోలతో ప్రమాదకర రీతిలో స్టంట్లు చేశారు. ఈ తతంగాన్ని కొంతమంది స్థానికులు వీడియో తీశారు. ఈ మేరకు ఓ నెటిజన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు వెంటనే స్పందించారు. ఆటోలతో ప్రమాదకర విన్యాసాలు చేసిన ఆరుగురిని…
ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఎంతో మంది ఎంతో ఉన్నతమైన పదవుల్లో ఉన్నా.. చిన్నప్పటి స్కూల్ జ్ఞాపకాలు మరవలేనివి. దేవుడు ఒక ఛాన్స్ ఇస్తే మళ్లీ చిన్ననాటి స్కూల్ డేస్ లోకి వెళ్లాలని చాలమందే అనుకుంటారు. స్కూల్ గురించి ఎవరైనా మాట్లాడిన మనం అనుకోకుండా మన స్కూల్ జ్ఞాపకాల్లోకి వెళ్లిపోతుంటాం. ఆనాడు చేసిన అల్లరిని గుర్తు చేసుకుంటుంటాం. పాఠశాల విద్యాభ్యాసం, 10 తరగతి పరీక్షల తరువాత అప్పటివరకు కలిసి చదువుకున్న స్నేహితులు ఇకనుంచి మనతో చదువుకోకుండా ఒక్కోరు ఒక్కో…
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రైల్వే స్టేషన్లో రైల్వే ఎస్సై వ్యవహరించిన తీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే… కాకినాడ రైల్వే స్టేషన్ రెండో నెంబర్ ప్లాట్‌ఫారంపైకి కాకినాడ-తిరుపతి రేణిగుంట ఎక్స్‌ప్రెస్ వచ్చింది. రైలు వెళ్ళిపోతున్న సమయంలో ఓ ప్రయాణికుడు రైలు ఎక్కే ప్రయత్నం చేశాడు. రన్నింగ్ ట్రైయిన్ కావడంతో పొరపాటున కాలు జారింది. ప్రయాణికులు రైలు, ప్లాట్ఫారం మధ్యలో ఇరుక్కుపోయాడు. రైలు అతడిని చాలా దూరం పాటు ఈడ్చుకెళ్లింది. అయితే ప్రయాణికుడిని వెంటనే గమనించిన రైల్వే ఎస్సై…
అసోంలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు స్కూటర్ కొనుగోలు చేసేందుకు తాను తాచుకున్న డబ్బంతా బైక్ షోరూంకు బస్తాలో తీసుకెళ్లాడు. అయితే ఆ నగదు అంతా చిల్లర నాణేలు కావడం విశేషం. వివరాల్లోకి వెళ్తే.. హిరాక్ జె దాస్ అనే చిల్లర వ్యాపారి కొత్త స్కూటర్ కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో నెలలు తరబడి చిల్లర నాణేలను పొదుపు చేశాడు. ఇలా ఎనిమిది నెలల పాటు పోగుచేసిన నాణేలను ఒక బస్తాలో వేసి…