అక్కడ ఒక బకెట్ నీళ్లుకావాలన్నా బావిలోకి దిగాల్సిందే.. ఎలాంటి సాయం లేకుండా కేవలం బావిలోని రాళ్లనే మెట్లుగా చేసుకొని ఎక్కడం దిగడం చేయాల్సిందే.. ఎక్కటప్పుడో దిగేటప్పుడో ప్రమాదవశాత్తు కాలజారితే భారం అంతా భగవంతుడిపైనే.. నీటి ఎద్దడికి నిలువుటద్దంలా ఓ మహిళ బావిలో దిగి నీళ్లు తీస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. మధ్యప్రదేశ్‌లోని అనేక ప్రాంతాల్లో తీవ్రమైన నీటి కొరతను ఈ వీడియో సాక్షిబూతమవుతోంది. వీడియోలో ఓ మహిళ నీటి కోసం ఎలాంటి తాడు, నిచ్చెన సాయం…
రాజకీయాల్లో మంత్రి స్థాయి హోదా.. రాష్ట్రంలోనే పలుకుబడి ఉన్న కుటుంబం.. 50 కి పైగా దాటిన వయస్సు.. భార్యాపిల్లలతో సంతోషంగా గడపాల్సింది పోయి చిలకొట్టుడు వ్యవహారాలను మొదలుపెట్టాడు.. తనకన్నా చిన్నవయస్సు యువతితో వివాహిత సంబంధం పెట్టుకొని ఇదుగో భార్యకు ఇలా అడ్డంగా బుక్కయ్యి పరువు పోగొట్టుకున్నాడు.. ఆయన ఎవరో కాదు గుజరాత్ కాంగ్రెస్ సీనియర్ నేత భరత్ సింగ్ సోలంకీ. మరో యువతితో రాసలీలలు నడుపుతూ భార్యకు అడ్డంగా దొరికిపోయాడు. ప్రస్తుతం ఈ ఘటన గుజరాత్ లో…
పంజాబీ సింగర్ సిద్ధూ మూస్ వాలా హత్య ప్రస్తుతం ఎంత సంచలనం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన సిద్దూ మూస్ వాలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. గేయ రచయితగా కెరీర్ ఆరంభించి లైసెన్స్ అనే పాటతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆ తరువాత జీ వ్యాగన్ అనే పాటతో పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో ఆయన డెవిల్ లెజెండ్ జస్ట్ లిజెన్ తామైయాన్ దా పుట్జ్ జాట్ దా ముకాబులా…
సోషల్ మీడియా వినియోగం విస్తృతంగా పెరిగినప్పటి నుంచి.. నెట్టింట్లో రకరకాల ఫన్నీ వీడియోలు దర్శనమిస్తున్నాయి. కొందరు వైరల్ అవ్వడానికి కావాలనే ఫన్నీ వీడియోస్ క్రియేట్ చేస్తుంటారు. మరికొన్ని మాత్రం అలా ఉండవు. సహజంగానే కొన్ని సంఘటనలు జరిగిపోతుంటాయి. అవి కడుపుబ్బా నవ్వులు తెవ్విస్తాయి. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఆ వివరాల్లోకి వెళ్తే… అదొక పెళ్ళి వేడుక.. ఘనంగా నిర్వహించారు.. బంధువులు, స్నేహితులు అంతా విచ్చేశారు.. అన్నీ అనుకున్న పనులు సవ్యంగా…
సాధారణంగా రైళ్లు రైలు పట్టాలపై, బస్సులు రోడ్లపై ప్రయాణిస్తుంటాయి. కానీ బెంగళూరులోని ఓ రైల్వేస్టేషన్లో బస్సులన్నీ రైలెక్కి కూర్చున్నాయి. ఈ అరుదైన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే… ఇప్పటివరకు మనం గూడ్స్ రైళ్లలో బైకులు, ట్రాక్టర్లు, లారీలు వంటి వాహనాలనే తరలించడం చూశాం. కానీ తొలిసారిగా ఆర్టీసీ బస్సులను అధికారులు గూడ్స్ రైలులో రవాణా చేశారు. Bharat Bandh: ఈనెల 25న భారత్ బంద్.. ఎందుకంటే..? బెంగళూరు, హోసూరులోని అశోక్ లేలాండ్…
కొత్త ఒక వింత .. పాత ఒక రోత.. అన్నట్టుగా ఏది చేసిన కొత్తగా చేయడంపై ఫోకస్ పెడుతోంది యూత్.. జీవితంలో ముఖ్య ఘట్టమైన పెళ్లిళ్లలోనూ కొత్త తరహా ఆలోచనలు చేస్తున్నారు.. కొత్త స్టంట్లు చేసి ప్రాణాలమీదకు తెచ్చుకున్నవారు కూడా లేకపోలేదు.. తాజాగా, ఓ జంట.. తమ వెడ్డింగ్ రిసెప్షన్లో చేసిన స్టంట్‌లో ఒక్కసారిగా.. అక్కడున్న అతినిథులు వణికిపోయేలా చేసింది.. నవ వధూవరులు చేసిన ఫైర్ స్టంట్తో కొందరు ఏకంగా పరుగులే పెట్టారట. వెడ్డింగ్ రిసెప్షన్లో జరిగిన…
వీధు కుక్కలు సరేసరి.. వాటి ఇష్టారాజ్యం.. కానీ, పెంపుడు కుక్కలు రోజుకు ఒకసారి లేదా రెండు మూడుసార్లు బయటకు తిప్పడం మళ్లీ ఇంట్లో పెట్టడం చేస్తుంటారు.. అయితే, ఏమైందో..? ఎక్కడి నుంచి వచ్చిందో కానీ.. ఓ శునకం ఎయిర్పోర్ట్లోప్రత్యక్షమైంది.. రన్‌వేపై పరుగులు పెడుతూ.. ఎయిర్పోర్ట్ సిబ్బందికి చుక్కలు చూపించింది.. దీనికి సంబంధించిన వీడియోను చిత్రీకరించిన ఓ వ్యక్తి.. సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. అది కాస్తా వైరల్‌గా మారిపోయింది. ఎయిర్‌పోర్ట్‌లో పరుగులు పెట్టడమే కాదు.. లక్షల్లో వ్యూస్..…
సత్యసాయి జిల్లా చిలమత్తూరు పోలీస్ స్టేషన్లో ఓ ఎస్సై రెచ్చిపోయాడు. ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఓ యువకుడిని చితకబాదాడు. దీంతో ఎస్సై దాడి చేసిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వివరాల్లోకి వెళ్తే.. తన తల్లి వికలాంగురాలు అని.. ఆమెకు వికలాంగురాలి పెన్షన్ మంజూరు చేపిస్తానని చెప్పి స్థానిక వైసీపీ నేత దామోదర్ రెడ్డి డబ్బు తీసుకుని మోసం చేశాడని బాధితుడు వేణు ఆరోపించాడు. వైసీపీ నేత దామోదర్ రెడ్డిని ప్రశ్నించేందుకు వెళ్లిన…
బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇక ఇటీవల విజయ్ దేవరకొండ, పూరి కాంబోలో తెరకెక్కుతున్న లైగర్ సినిమాలో నటిస్తూ మరింత ఫేమస్ అయ్యాడు. తాజాగా ఈ బాక్సింగ్ లెజెండ్ విమానంలో తోటి ప్రయాణికుడిపై పిడిగుద్దులతో విరుచుకుపడ్డాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఒక వ్యక్తి.. విమానంలో మైక్ టైసన్ ను చూసి అత్యుత్సాహ పడి.. అతనిని తన కెమెరాలో…
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అలాంటిది భారత్‌లో పాకిస్థాన్ జిందాబాద్ అనే నినాదం వినిపిస్తే ఇంకేమైనా ఉంటుందా? కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితే నెలకొంది. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో సింఘై కలాన్ గ్రామంలో ఓ వ్యక్తి తన షాపులో ‘పాకిస్తాన్ జిందాబాద్’ పాట ప్లే చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన బీజేపీ నేతలు భూటా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఇద్దరు నిందితులపై పోలీసులు…