ప్రస్తుతం ఓ వీడియో సోషల్ మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. లైవ్ లోనే ఓ లేడీ జర్నలిస్ట్ ఓ బాలుడి చెంపచెల్లమనిపించింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది జరిగింది మనదేశంలో కాదు పాకిస్తాన్ లో. గతంలో కూడా చాలా మంది పాక్ జర్నలిస్టుల వీడియోలు చాలా ఫేమస్ అయ్యాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి ఓ లేడీ జర్నలిస్ట్ కూడా చేరింది. అయితే తను చేసిన చర్యను సదరు లేడీ జర్నలిస్టు మైరా హస్మీ సమర్థించుకున్నారు.
ఇటీవల ఈద్- అల్ అధా పండగ సందర్భంగా సదరు లేడీ జర్నలిస్టు లైవ్ లో పండగ విశేషాలను పంచుకుంటున్న సమయంలో ఈ ఘటన జరిగింది. తన ఎదురుగా ఉన్న బాలుడి చెంపపై కొట్టింది. ఈ ఘటనపై మైరా హస్మీకి మద్దతుగా, వ్యతిరేకంగా నెటిజెన్లు స్పందిస్తున్నారు. ఇప్పటికే ఈ వీడియోను 4 లక్షల మంది చూశారు. లైవ్ జరుగుతుండగా.. సదరు బాలుడు తన చేయెత్తి ఎవరినో పిలిచాడు. అదే సమయంలో జర్నలిస్ట్ మైరా హస్మీ బాలుడిపై చేయి చేసుకుంది.
Read Also: Rash Driving: ప్రయాణికులు మందలించారని బస్సు వదిలి వెళ్లిపోయిన ఆర్టీసీ డ్రైవర్
ఈ ఘటనపై బాలుడిని కొట్టే హక్కు మీకెవరు ఇచ్చారంటూ నెటిజెన్లు ప్రశ్నించగా.. కొంతమంది మాత్రం సదరు బాలుడు ఏదో అనుచిత ప్రవర్తన చేసిందుకే జర్నలిస్ట్ ఇలా రియాక్ట్ అయిందని ఆమెకు మద్దతు తెలియజేస్తున్నారు. అయితే ఈ ఘటనపై జర్నలిస్ట్ మైరా హస్మీ స్పందించారు. లైవ్ జరిగే సమయంలో బాలుడు ఓ కుటుంబాన్ని వేధిస్తున్నాడంటూ ట్వీట్ చేశారు. ఇలాంటి ప్రవర్తనను సహించకూడదని.. కామెంట్ చేశారు. ఈమెకు ట్విట్టర్ లో 9800 మంది ఫాలోవర్లు ఉన్నారు.
????????? pic.twitter.com/Vlojdq3bYO
— مومنہ (@ItxMeKarma) July 11, 2022