బర్మింగ్ హామ్ వేదికగా.. కామన్వెల్త్ క్రీడలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ క్రమమంలో.. క్రీడల్లో ఓ అపశ్రుతి చోటుచేసుకుంది. 10కి.మీ స్క్రాచ్ రేసులో భారత సైక్లిస్ట్ మీనాక్షి అదుపుతప్పి కిందపడడ్డారు.. దీంతో వెనుకనుండి వస్తున్న ప్రత్యర్థి న్యూజిల్యాండ్ సైక్లిస్ట్ బ్రయానీ బోథా సైకిల్ మీనాక్షి పై నుంచి దూసుకెళ్లడంతో.. తీవ్రంగా గాయపడింది. అక్కడున్న పోటీ నిర్వాహకులు వెంటనే స్పందించి మీనాక్షిని స్ర్టెచర్ పై తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
read also: Ravi teja: ‘టైగర్ నాగేశ్వరరావు’కు తోడుగా అనుపమ్ ఖేర్!
కాగా.. ఈ ఈవెంట్‌లో ఇంగ్లండ్‌కు చెందిన లారా కెన్నీ బంగారు పతకాన్ని గెలుచుకుంది. అయితే.. ఇక్కడి లీ వ్యాలీ వెలో పార్క్ వద్ద రెండు రోజుల్లో ఇది రెండో ప్రమాదం. ఇంతకుముందు కూడా ఇంగ్లండ్‌కు చెందిన మాట్ వాల్స్ కూడా ఈవెంట్‌లో సైకిల్‌పై నుంచి పడిపోవడంతో.. అతనికి కుట్లు పడ్డాయి. అదే సమయంలో కెనడాకు చెందిన సైక్లిస్టులు మాట్ బోస్టాక్, డెరెక్ జి కూడా ఆసుపత్రి పాలయ్యారు.
#Indian cyclist #Meenakshi suffers #crash, run over by rival at #CWG2022.#India #cyclist #CWG #TrendingNews #Viral #UnMuteIndia #YourSay pic.twitter.com/xj69ijPGO9
— UnMuteINDIA (@LetsUnMuteIndia) August 2, 2022