శ్రీలంకలో ఆందోళనలు మిన్నంటాయి. అధ్యక్షుడ గోటబయ రాజపక్స రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం వేలాది నిరసనకారులు అధ్యక్ష భవనాన్ని ముట్టడించారు. పరిస్థితులు విషమించాయనే ఇంటలిజెన్స్ నివేదికలతో అధ్యక్షుడు దేశం వదిలి పారిపోయాడని సమాచారం. శనివారం అధ్యక్ష భవనానికి భారీ భద్రత ఉన్నా బారికేడ్లు, టియర్ గ్యాస్ తో ఆందోళనకారుల్ని నిలువరించే ప్రయత్నం చేసినా.. అధ్యక్ష భవనాన్ని ముట్టడించారు. అధ్యక్ష భవనంతో పాటు ఆయన సెక్రటేరియట్ వద్ద ప్రజలు వేలాదిగా శ్రీలంక జెండాను పట్టుకుని గుమిగూడారు.
అయతే అధ్యక్షుడిని శ్రీలంకన్ ఆర్మీ సురక్షిత ప్రాంతానికి తరలించారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే శ్రీలంక అధ్యక్ష భవనంలోని ప్రవేశించిన నిరసనకారులు అక్కడ ఎంజాయ్ చేస్తున్న వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అధ్యక్ష భవనంలోని స్మిమ్మింగ్ పూల్ లో నిరసనకారులు ఈత కొడుతుండటం ఈ వీడియోలో చూడవచ్చు. దీంతో పాటు అధ్యక్ష భవనంలోని వంటగదిలో నిరసనకారులు మందు తాగుతూ కనిపించారు. అంతే కాకుండా అక్కడే వంటి చేస్తున్న వీడియోలు, ఆహారం తింటున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Read Also: Gotabaya Rajapaksa: సూట్‌కేస్‌లతో పారిపోతున్న శ్రీలంక అధ్యక్షుడి వీడియో వైరల్
ఇక ఈ నిరసనలకు పెద్ద ఎత్తున్న మాజీ క్రికెటర్లు, సెలబ్రెటీలు మద్దతు ప్రకటించారు. మన భవిష్యత్తు కోసం అంటూ మాజీ స్టార్ క్రికెటర్ కుమార్ సంగక్కర్ ఆందోళనల వీడియోను ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే మరోవైపు అధ్యక్షుడు సూట్ కేసులతో పారిపోతున్న ఓ వీడియో కూడా ప్రస్తుతం ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతోంది. 1948 బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్య్రం పొందిన శ్రీలంక గత ఏడు దశాబ్ధాల కాలంలో ఇలాంటి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోలేదు. కనీసం పెట్రోల్, డిజిల్ కొనేందుకు కూడా విదేశీమారకద్రవ్యం లేదు. వీటన్నింటికి అధ్యక్షుడు గోటబయ రాజపక్స, మాజీ ప్రధాని మహిందా రాజపక్సల అవినీతే కారణం అంటూ ప్రజలు ఉద్యమిస్తున్నారు.
Inside President's House. #SriLanka #SriLankaProtests pic.twitter.com/e49jeDIldv
— Jamila Husain (@Jamz5251) July 9, 2022
Remember for last two years Modi Govt managed to provide Free ration for crores of people. In Sri Lanka everything is imported so they could not do so.
Here people are seen eating food in presidential kitchen.pic.twitter.com/9lcbfR8xlu
— Arun Pudur 🇮🇳 (@arunpudur) July 9, 2022