Viral Video: కాదేది బట్టలారేయడానికి అనర్హం.. అన్నట్లుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగాళఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో తెలుగురాష్ట్రాల్లోనే కాకుండా మహారాష్ట్రలో సైతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఐదారు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో సూర్యుడి జడ లేదు. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు. బయట వర్షం పడితే బట్టలు ఆరబెట్టడం ఎంత కష్టమో ఇప్పుడు మనకు తెలుసు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో ఇళ్లలో ఉతికిన బట్టలు ఆరేయడానికి సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ముంబాయి లోకల్ ట్రైన్‌లో కొందరు తడిచిన తమ దుస్తులను ఆరేయడాన్ని వీడియో తీసి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ముంబయిలో భారీ వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. దీంతో సామాన్యుల జీవనాన్ని అస్తవ్యస్తంగా మారింది.
ముంబైవాసులు రోజువారీ పనులను కోసం జుగాద్ మార్గంలో వెళ్లే వారు కొంతమంది తడిసిన దుస్తులను రైలులో ఎండబెట్టాలని నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో దాదర్ ముంబైకర్ అనే పేజీ ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయబడింది. ఈ వీడియోలో.. ముంబై లోకల్ రైలు కోచ్‌లోని రాడ్‌లపై బట్టలు వేలాడుతూ ప్రయాణికులు రైలు ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నట్లు చూడవచ్చు. ఒక శాలువా, బెడ్‌షీట్ మరియు టవల్ ఆరిపోయేలా రాడ్‌లకు వేలాడదీయడం కనిపిస్తుంది. అయితే ఈ వీడియో ఇప్పటివరకు 9వేలకు పైగా లైక్‌లు పొందడమే కాకుండా.. ఈ వీడియోపై ఫన్నీ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.
Also Read
- Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
- Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
- Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
- WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!