మంత్రి మల్లారెడ్డి సొంత నియోజకవర్గంలో సమస్యలపై స్పందించడం లేదని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తూముకుంట, శామీర్ పేట, ప్రాంతాల్లో గ్రంథాలయ భవన నిర్మాణాల శంకుస్థాపనకు విచ్చేసిన మంత్రి మల్లారెడ్డికి గ్రామస్తులు తమ సమస్యలు చెప్పుకోవడానికి వెళ్తే అధికార పార్టీ నాయకులు అడ్డుకుంటున్నారని గ్రామస్థులు ఫైర్ అయ్యారు.
రాజస్థాన్‌లోని భిల్వారాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ విద్యార్థిని స్కూల్ బ్యాగ్ లోంచి వాటర్ బాటిల్ తీసి అందులో మూత్రం పోశాడు మరో విద్యార్థి. అంతేకాకుండా విద్యార్థిని బ్యాగ్‌లో ప్రేమ లేఖను కూడా పెట్టాడు.
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం వినగడప గ్రామంలో శ్రీలక్ష్మి స్టోన్ క్రషర్స్ లో బ్లాస్టింగ్ తో వాయు ధ్వని కాలుష్యంతో గ్రామస్థులు తీవ్రంగా అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇచ్చిన పరిధికి మించి బ్లాస్టింగ్ చేయటం వల్ల తమ ఇళ్లు బీటలు వారుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Black Magic: చేతబడి చేస్తున్నారనే అనుమానంతో దంపతులను చెట్టుకు ప్రమాదకర రీతిలో వేలాడదీశారు. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలో జరిగిన ఓ సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
మహారాష్ట్రలోని నాసిక్‌లోని కోశింపాడ గ్రామ ప్రజలు గుక్కెడు నీటి కోసం నానా అవస్థలు పడుతున్నారు. గ్రామంలో త్రాగు నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నివాసితులు తమ బిందేలు నింపడానికి బావిలోకి దిగుతున్నారు.
ఉత్తర మధ్య నైజీరియాలో అమాయక ప్రజలపై ముష్కరులు కాల్పులతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో 29 మంది మరణించారు. సమీపంలోని గ్రామాలపై తుపాకులతో జరిపిన భీకర కాల్పుల్లో 29 మంది ప్రాణాలు కోల్పోగా.. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ మేరకు నైజీరియా అధికారులు వెల్లడించారు.
Suspicious Death : పొలాన్ని కాపాడుకోవడానికి ఇద్దరు గ్రామస్తులు రాత్రి ఆలయంలో నిద్రించారు. గ్రామస్థులు తెల్లవారుజామున ఆలయానికి వచ్చి చూడగా ఇద్దరూ శవమై కనిపించారు.
Chegunta: మెదక్ జిల్లా చేగుంట మండలం పెద్ద శివునూరు గ్రామస్తులు దీపావళి నుంచి భయాందోళనలో ఉన్నారు. ఏం జరుగుతుందో తెలియడం లేదు. పండగరోజు నుంచి 70మందికి పైగా గ్రామస్తులకు వాంతు, విరేచనాలు అవుతున్నాయి.