మంత్రి మల్లారెడ్డి సొంత నియోజకవర్గంలో సమస్యలపై స్పందించడం లేదని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తూముకుంట, శామీర్ పేట, ప్రాంతాల్లో గ్రంథాలయ భవన నిర్మాణాల శంకుస్థాపనకు విచ్చేసిన మంత్రి మల్లారెడ్డికి గ్రామస్తులు తమ సమస్యలు చెప్పుకోవడానికి వెళ్తే అధికార పార్టీ నాయకులు అడ్డుకుంటున్నారని గ్రామస్థులు ఫైర్ అయ్యారు. దేవరయాంజల్ కి చెందిన ప్రజలు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు దరాఖాస్తు పెట్టుకుని సంవత్సరాలు గడుస్తు్న్న ఇప్పటి వరకు రాలేదని కనీసం గ్రామంలోని ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుంటే వాటిని కూల్చివేస్తున్నారని వారు ఆరోపించారు. కానీ, ఇతర ప్రాంతాల్లో నుంచి వచ్చిన వారు దేవదాయ శాఖ భూముల్లో అక్రమ నిర్మాణాలు బిల్డింగులు కట్టుకుంటే మంత్రి మల్లారెడ్డి ఎందుకు పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Apple Company Warning : అలా అస్సలు చేయొద్దు.. యూజర్లకు యాపిల్ కంపెనీ వార్నింగ్
ఎన్నికల ముందు గ్రామాల్లోకి వచ్చి హామీలు ఇచ్చి వెళ్లిపోవడం తప్ప ఎన్నికలు అయిపోయినక మళ్లీ గ్రామాల వైపు కన్నెత్తి చూడని మంత్రి మల్లారెడ్డి.. కనీసం ఇప్పుడైనా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇప్పించాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. శామీర్ పేట గ్రామంలో కూడా అధికార పార్టీ నాయకులను గ్రామస్తులు నిలదీశారు. డబులు బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వడం లేదు.. ఇచ్చిన వాళ్ళకే పెద్దమ్మ కాలనీలో ప్లాట్స్ ఇస్తున్నారని మంత్రి మల్లారెడ్డి తొమ్మిది సంవత్సరాలు అవుతున్న తమ సమస్యలను పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, గ్రామస్థులను, మహిళలను అధికార పార్టీ నాయకులు బుజ్జగించిన వారు వినలేదు.
Read Also: 3D-Printed Post Office: దేశంలోనే తొలి 3డీ పోస్టాఫీసు.. పురోగతికి నిదర్శనమన్న ప్రధాని