పాలు తాగే సాయి బాబా విగ్రహం, కళ్ళు తెరిచిన అమ్మవారు గురించి మనం విన్నాం. కానీ అల్లూరి సీతారామరాజు జిల్లాలో మరో అద్భుతం జరిగింది. కూనవరం మండలం జగ్గవరం గ్రామంలో ఆలస్యంగా వెలుగు చూసిందో ఘటన..దసరా నవరాత్రి ఉత్సవాల్లో అమ్మ వారి ఊరేగింపులో అద్బుతం జరిగింది. అమ్మవారి కలశానికి ధరించిన గాజులు వాటంతట అవే తిరుగుతున్న వైనం వీడియో వైరల్ అవుతోంది. ఇది చూసిన భక్తులు, గ్రామస్తులు ఊరేగింపు ఉత్సవాల్లో ఆశ్చర్యానికి గురయ్యారు. ఇదంతా అమ్మవారి లీలలు అంటూ పరవశించిన భక్తులు ఈ విషయం అందరికీ షేర్ చేశారు. వీడియో వాట్సప్ లో చెక్కర్లు కొడుతూ ఆలస్యంగా వెలుగు చూసింది.
Read Also: TRS BJP Munugode Election Nomination: నేడే టీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థుల నామినేషన్..
అమ్మవారి కలశానికి ధరించిన గాజులు వాటంతట అవే తిరుగుతున్నాయి. అద్భుతమైన ఈ మహిమ ఆశ్చర్యం గొలుపుతుంది. దసరా ఉత్సవాల ముగింపులో చోటుచేసుకున్న ఈ సన్నివేశం భక్తులను మంత్రముగ్థులను చేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం జగ్గవరం గ్రామంలో అమ్మవారి దగ్గర అలంకరించిన గాజులు అవే తిరగడం ప్రారంభించాయి. దసరా నవరాత్రి ఉత్సవాల్లో అమ్మ వారి ఊరేగింపులో ఈ అద్బుతం చోటు చేసుకుంది.అమ్మవారి కలశానికి ధరించిన గాజులు వాటంతట అవే తిరుగుతున్న వైనాన్ని.. భక్తులు సెల్ ఫోన్ లలో చిత్రీకరించారు. ఊరేగింపు ఉత్సవాల్లో ఇది చోటు చేసుకుంది. దీంతో భక్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇది అమ్మవారి లీలలు అంటూ భక్తులు పరవశించిపోయారు.వీడియో వాట్సప్ లో చెక్కర్లు కొడుతూ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Read Also: Mulayam Singh Yadav Passes Away: రాజకీయ కురువృద్ధుడు ములాయం సింగ్ యాదవ్ ఇకలేరు..
వాటంతటవే తిరుగుతున్న గాజులు వీడియో ఇదే..