Suspicious Death : పొలాన్ని కాపాడుకోవడానికి ఇద్దరు గ్రామస్తులు రాత్రి ఆలయంలో నిద్రించారు. గ్రామస్థులు తెల్లవారుజామున ఆలయానికి వచ్చి చూడగా ఇద్దరూ శవమై కనిపించారు. ఈ ఘటనతో గ్రామంలో సంచలనం నెలకొంది. చంద్రాపూర్‌లోని భద్రావతి తాలూకాలో ఓ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. మంగ్లీ గ్రామంలో జగన్నాథ్ బాబా ఆలయం ఉంది. ఈ ఆలయంలో రాత్రి నిద్రించడానికి వెళ్లిన గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులను గుర్తుతెలియని నిందితులు హతమార్చారు. హత్యకు గురైన వారు మధుకర్ ఖుజే, బాపురావ్ ఖార్కర్. ఈ మేరకు భద్రావతి పోలీస్ స్టేషన్‌లో హత్య కేసు నమోదు చేసి గుర్తు తెలియని నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Read Also: Kantara 2: రిషబ్ శెట్టి మొదలు పెట్టాడు… ఈసారి అంతకుమించి
మంగ్లీ గ్రామానికి చెందిన మధుకర్ ఖుజే, బాపురావ్ ఖర్కర్ దంపతులకు జగన్నాథ బాబా గుడి సమీపంలో పొలం ఉంది. ఈ పొలాన్ని కాపాడుకోవడానికి, ఈ ఇద్దరు గ్రామస్తులు ఆలయంలో నిద్రించేవారు. ఎప్పటిలాగే నిన్న రాత్రి వీరిద్దరూ గుడిలో నిద్రకు ఉపక్రమించారు. అయితే ఉదయం ఇద్దరి మృతదేహాలు రక్తపు మడుగులో కనిపించాయి. ఈ ఘటనపై వెంటనే భద్రావతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు. ఈ సమయంలో ఆలయంలో కానుక పెట్టె ఉండడంతో చోరీ ఉద్దేశంతో హత్య చేసి ఉండొచ్చని ప్రాథమికంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితులు ఎలా హత్య చేశారనేది ఇంకా తెలియరాలేదు. ఇద్దరి మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై పోలీసులు తదుపరి విచారణ జరుపుతున్నారు.
Read Also: AP MLC Elections : కొనసాగుతున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్