Cow Dung: భారతీయ సంస్కృతిలో ఆవును గోమాతగా పూజిస్తారు.. ఇక, గోవు నుంచి లభించే పాలకే కాదు.. గోమూత్రానికి, గోవు పేడకు కూడా కొన్ని అతీత శక్తులు ఉన్నాయని నమ్ముతారు.. ఆవు పేడను ఎరువుగా, బయోగ్యాస్ తయారీకి, నిర్మాణ సామగ్రిగా మరియు ఆయుర్వేద ఉత్పత్తుల తయారీకి కూడా ఉపయోగిస్తారు. దీనికి దేశీయంగా, అంతర్జాతీయంగా కూడా మంచి డిమాండ్ ఉంది, ముఖ్యంగా సేంద్రీయ వ్యవసాయం మరియు ఇంధన అవసరాల కోసం ఆవు పేడ బాగా ఉపయోగ పడుతుంది.. అయితే,…
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్‌లో దోపిడీ ఆరోపణలపై గ్రామస్థులు ఇద్దరు ఇన్‌స్పెక్టర్లను బందీలుగా పట్టుకున్నారు. ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు అక్రమంగా డబ్బులు వసూలు చేసేందుకు గ్రామానికి వెళ్లారని, అక్కడ ఓ యువకుడిని చెప్పుతో కొట్టారని గ్రామస్థులు తెలిపారు.
అస్సాంలో మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు తఫాజుల్ ఇస్లాం శనివారం ఉదయం పోలీసుల అదుపు నుంచి తప్పించుకున్నాడు. నాగావ్ జిల్లాలోని డింగ్ వద్ద చెరువులో దూకి మరణించిన విషయం తెలిసిందే.
అర్థరాత్రి ప్రియురాలిని కలిసేందుకు వెళ్లిన ఓ ప్రియుడికి ఘోర అనుభవం ఎదురైంది. చీకట్లో ప్రియురాలి కోసం వెళ్తుండగా గ్రామస్తుడు ఒకతను చూశాడు. అతను చూడకుండా ఉండేందుకు దాక్కోవడంతో.. విషయం సీరియస్ గా మారింది. దీంతో.. ప్రేమికుడిని చూసిన గ్రామస్తుడు.. గట్టిగా కేకలు వేశాడు. దీంతో.. గ్రామస్తులంతా కలిసి కర్రలు పట్టుకుని వచ్చి యువకుడిని దొరకబట్టి చెట్టుకు కట్టేసి తీవ్రంగా కొట్టారు. ఈ ఘటన యూపీ ఇటావాలోని రాంపుర గ్రామంలో జరిగింది.
సాధువుల వేషంలో దర్జాగా చోరీలకు పాల్పడుతున్న నలుగురు దొంగలను గ్రామస్తులు పట్టుకున్నారు. అనంతరం వారికి స్థానికులు బడిత పూజ చేశారు. కర్రలు, చెప్పులతో చితకబాదారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఉత్తరాఖండ్లో ఓ అమాయక చిన్నారిని చిరుత బలి తీసుకుంది. తన ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న తొమ్మిదేళ్ల బాలికపై దాడి చేసి చంపి తిన్నది. ఈ ఘటన జరిగిన మూడు గంటల తర్వాత ఇంటికి 30 మీటర్ల దూరంలోని పొదల్లో సగం తిన్న బాలిక మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనతో గ్రామంలో భయాందోళన నెలకొంది. దీంతో.. ప్రజలు తీవ్ర ఆగ్రహానికి గురై.. దానిని మట్టుబెట్టేందుకు చూస్తున్నారు.
మహారాష్ట్రలోని జల్‌గావ్‌లో పోలీస్‌స్టేషన్‌పై గుంపు రాళ్లు రువ్విన ఉదంతం వెలుగు చూసింది. ఈ ఘటనలో 8 మంది పోలీసులు గాయపడగా, వారిలో ఆరుగురిని ఆస్పత్రిలో చేరిపించారు. ఈ ఘటన తర్వాత ఆ ప్రాంతంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కర్ఫ్యూ విధించారు.
ఓ యువకుడు బంఫరాఫర్ కొట్టేశాడు. 19 ఏళ్ల వయసులో రెండు పెళ్లుళ్లు చేసుకుని వార్తల్లో నిలిచాడు. ఒకరికి తెలియకుండా మరొకరిని ముగ్గులోకి దించి.. ఇద్దర్నీ 20 రోజుల వ్యవధిలో మనువాడాడు
మహబూబాబాద్ జిల్లా పొనుగోడులోని స్టోన్స్ క్రస్సర్లో అర్ధరాత్రి బాంబు బ్లాస్టింగ్ చేశారు. దీంతో.. గూడూరు మండలం పొనుగోడు గ్రామ శివారులోని రేణుక స్టోన్స్ క్రస్సర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బ్లాస్టింగ్ తో తమ గ్రామానికి ప్రమాదం జరుగుతుందని రేణుక క్రస్సర్ యాజమాన్యాన్ని గాజులగట్టు గ్రామస్తులు అడ్డగించారు. బాంబు పేలుళ్ళకు ఒక్కసారిగా భయంతో ఇళ్లలో నుంచి గ్రామస్తులు రోడ్లపైకి పరుగులు తీశారు. అంతేకాకుండా.. భారీ పేలుళ్ళకు ఇళ్ల గోడలకు బీటలు, ప్రమాదకరంగా నెర్రలు పడ్డాయని ఆరోపిస్తున్నారు.
మధ్యప్రదేశ్‌లోని తికమ్‌గఢ్ జిల్లాలో టమాటాలను ఎత్తుకెళ్లిన ఉదంతం తెరపైకి వచ్చింది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు టమోటాలతో ఉన్న వాహనంలోని డ్రైవర్‌ను కొట్టి తీసుకెళ్లారు.