Strange Customs: భారత సమాజం భిన్న సంస్కృతుల సమ్మేళనం.. దేశంలో భిన్న మతాలు, కులాలు, సాంస్కృతిక భిన్నత్వం ఉన్నప్పటికీ భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించింది.. ఇక, ఇవి రాష్ట్రాలను, ప్రాంతాలను.. గ్రామాలను బట్టి కూడా మారుతూ ఉంటాయి.. వింత ఆచారాలు కొన్నిసార్లు ఆశ్చర్యపరుస్తుంటాయి.. కానీ, అలా చేస్తే.. మంచి జరుగుతుందని ప్రజల విశ్వాసంగా ఉంది.. దీంతో.. చాలా మంది వారి విశ్వాసాలను గౌరవిస్తారు.. ఇక, వర్షాల కోసం కూడా ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా పూజలు చేస్తుంటారు.. కాకినాడలోని జగ్గంపేట మండలం కాండ్రేగులలో వర్షం కోసం గ్రామస్తులు వింత ఆచారం అనుసరిస్తారు.
Read Also: Upendra: వారి గురించి నీచంగా మాట్లాడిన ఉపేంద్రపై కేసు.. స్టే ఇచ్చిన కోర్టు
ఆ గ్రామంలో వర్షాలు కురవాలంటూ చిన్నారులకి పాండవులు వేషం వేసి.. భాజ భజంత్రీలతో.. పువ్వులు, పాలు, ప్రసాదాలతో ఊరేగింపుగా కొండపైకి వెళ్లారు గ్రామస్తులు.. కొండమీద పూజలు చేసి నైవేథ్యం పెట్టి తీసుకుని వెళ్లిన పాలతో ప్రసాదం తయారుచేసి అందరికీ పంచారు గ్రామస్తులు.. ఇలా చేయడాన్ని పాల పొంగు అంటారని.. పూర్వం వర్షాల కోసం ఈ విధంగా చేసే వారాని గ్రామస్తులు చెబుతున్నారు. మొత్తంగా చిన్నారులకు టవాళ్లు లుంగీలుగా కట్టి పాండవుల వేషం వేసి పూజలు నిర్వహించారు.. గ్రామంలో భాజ భజంత్రీలతో తిరిగారు.. వారిపై గ్రామస్తులు బకెట్లు, బిందెలతో నీళ్లు పోశారు. వేషాలు వేసిన చిన్నారులు ఎంజాయ్ చేశారు.. ఇక, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాల కోసం కప్పలను ఊరేగించడం.. కప్పలకు పెళ్లి చేయించడం లాంటి ఆచారాలను పాటించే విషయం విదితమే. మొత్తంగా కాండ్రేగులలో వర్షం కోసం చిన్నారులతో వేయించిన వేషాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ఆ మధ్య భారీ వర్షాలు కురిసినా.. ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం మాత్రమే నమోదైన విషయం విదితమే.