ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం వినగడప గ్రామంలో శ్రీలక్ష్మి స్టోన్ క్రషర్స్ లో బ్లాస్టింగ్ తో వాయు ధ్వని కాలుష్యంతో గ్రామస్థులు తీవ్రంగా అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇచ్చిన పరిధికి మించి బ్లాస్టింగ్ చేయటం వల్ల తమ ఇళ్లు బీటలు వారుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో నుంచి అధిక లోడుతో అతివేగంగా నడుస్తున్న టిప్పర్లు వల్లనా రోడ్డు ప్రమాదాలు జరిగి పలువురు గాయపడి, మూగజీవాలు సైతం మరణించాయని వినగడప గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
Read Also: Vyooham: వర్మ ‘వ్యూహం’లో చిరు, పవన్.. ‘అల్లు’ వారిని కూడా వదలలేదుగా!
పరిమితికి మించి లోతు త్రవ్వకాలు జరుపుతున్నారని దీంతో నీరు కూడా కాలుష్యం అవుతుంది అని వినగడప గ్రామస్థులు అంటున్నారు. మా వినగడప గ్రామంతో పాటు చుట్టుప్రక్కల గ్రామ ప్రజలు ఈ క్వారీ వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు అంటూ వారు వాపోతున్నారు. ఇప్పటికే ఎంతోమంది అధికారులకు ఫిర్యాదులు చేసిన పట్టించుకోవటం లేదని గ్రామస్థులు అంటున్నారు. ఈరోజు స్పందన కార్యక్రమంలో తహశీల్దార్ కి మరొక సారి వినతిపత్రం అందజేశాము గ్రామస్థులు తెలియజేశారు.
Read Also: Heavy Rains: మధ్యప్రదేశ్‌లో వరుణుడి ప్రతాపం.. ఆరెంజ్ అలర్ట్ జారీ
అయితే ఆంధ్రప్రదేశ్ లో అక్రమ తవ్వకాలకు పాల్పడుతన్న వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే పరిమితికి మించి తవ్వకాలు జరిపే క్వారీలను అధికారులు మూసివేస్తున్నారు. దీంతో ఎన్టీఆర్ జిల్లాలోని వినగడప గ్రామంలోని శ్రీలక్ష్మీ స్టోన్ క్రషర్స్ బ్లాస్టింగ్ ఇష్యూ రోజురోజుకు వివాదం అవుతుండటంతో అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇప్పటికైన తమ వినతులను స్వీకరించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇలాంటివి మరోసారి జరుగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అన్నారు.