రాజస్థాన్‌లోని భిల్వారాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ విద్యార్థిని స్కూల్ బ్యాగ్ లోంచి వాటర్ బాటిల్ తీసి అందులో మూత్రం పోశాడు మరో విద్యార్థి. అంతేకాకుండా విద్యార్థిని బ్యాగ్‌లో ప్రేమ లేఖను కూడా పెట్టాడు. మధ్యాహ్న భోజనం అనంతరం తన బాటిల్‌ను విప్పి చూడగా వాసన రావడంతో విషయం తెలిసింది. అనంతరం ఈ విషయంపై ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసింది. కానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆగ్రహించిన గ్రామస్తులు.. నిందితుడు ఉండే ప్రాంతానికి వెళ్లి నానా హంగామా సృష్టించారు.
Jawan: వందమంది అమ్మాయిలతో షారుఖ్ .. దుమ్ము దులిపేశాడు అంతే
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిపై లాఠీచార్జి చేశారు. ఈ ఘటనపై విద్యార్థిని నుంచి కానీ, కుటుంబ సభ్యుల నుంచి కానీ ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. ఫిర్యాదు చేస్తే విచారణ చేపడతామని పోలీసులు తెలిపారు. మరోవైపు గొడవకు పాల్పడ్డ వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘటనపై శనివారం పాఠశాల ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసినట్లు విద్యార్థి కుటుంబ సభ్యులు తెలిపారు.
Sagileti Katha Trailer: తెలంగాణాకి బలగం.. రాయలసీమకి ’సగిలేటి కథ’
ఈ సంఘటన లుహరియా గ్రామంలో జరిగింది. సీనియర్ హయ్యర్ సెకండరీ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థిని.. శనివారం మధ్యాహ్న భోజన సమయంలో స్కూల్‌లో బ్యాగ్ పెట్టి ఇంటికి వెళ్లింది. ఆ తర్వాత స్కూల్ కు వెళ్లిన బాలిక.. దాహం వేయడంతో వాటర్ బాటిల్ తెరిచి చూడగా మూత్రం వాసన వచ్చింది. అంతేకాకుండా బ్యాగ్ లో ప్రేమ లేఖ ఉన్నట్లు తెలిపింది. వెంటనే పాఠశాల ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు.. ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులకు చెప్పినట్లు బాధిత విద్యార్థిని తెలిపింది. ఆదివారం సెలవు దినం కావడంతో బంధువులు సోమవారం పాఠశాలకు చేరుకుని మరోసారి ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది. ఇంత జరిగినా ప్రిన్సిపాల్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని విద్యార్థిని ఆరోపించింది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా.. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఆగ్రహానికి గురైన ప్రజలు.. నిందితుడు ఉండే ప్రాంతానికి వెళ్లి రాళ్లు రువ్వారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని లాఠీచార్జి చేసి జనాన్ని చెదరగొట్టారు.