Fire Broke Out in Vijayawada TVS Showroom: విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున కేపీ నగర్ ప్రాంతంలో ఉన్న టీవీఎస్ వాహనాల షోరూంలో భారీ మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో షోరూమ్‌తో పాటు గోదాంలో ఉన్న దాదాపు మూడు వందల ద్విచక్ర వాహనాలు దగ్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో ఎలక్ట్రిక్ వాహనాలు కూడా ఉన్నాయి. మూడు ఫైరింజన్లు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.…
Bhandi Sanjay: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విజయవాడ పర్యటన రద్దైంది. హైదరాబాద్-గన్నవరం ఫ్లైట్ 4 గంటలు ఆలస్యం కావడంతో పర్యటన రద్దు చేసుకున్నట్లు బీజేపీ శ్రేణులు వెల్లడించారు. మధ్యాహ్నం ఒంటి గంటకు వర్చువల్ ద్వారా ఓటర్ చేతన్ అభియాన్ కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొని ప్రసంగించునున్నారు.
మనం ఒక్క సిమ్ కార్డు తీసుకునేందుకు నానా తిప్పలు పడుతుంటే ఓ వ్యక్తి ఏకంగా వందల సంఖ్యలో సిమ్ కార్డ్స్ తీసుకుని వాడుతున్నాడు. ఎక్కడో కాదండోయ్ మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే జరిగింది.
ఛలో విధ్యుత్ సౌద మరియు మహాధర్నా సందర్భంగా విజయవాడలోని హోటల్స్, లాడ్జ్ లను ఎన్టీఆర్ జిల్లా పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈనెల 8న చలో విద్యుత్ సౌధ పిలుపు నేపథ్యంలో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు.