ప్రస్తుతం తెలుగు అంతరించిపోయే దశలో ఉందనే ఆందోళన కలుగుతోంది అని పురంధేశ్వరి అన్నారు. భాష మృతభాషగా మారడం మన సంస్కృతి అంతరించడమే.. మన సంస్కృతి, సాంప్రదాయం తెలుగు సాహిత్యంలో నిక్షిప్తమై ఉన్నాయని ఆమె ఈ సందర్భంగా వ్యాఖ్యనించారు.
విజయవాడలోని సత్యనారాయణపురం బీఆర్టీఎస్ రోడ్డు ఫుడ్ జంక్షన్ పార్క్ వద్ద వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి తానేటి వనిత, ఎంపి అయోధ్యరామిరెడ్డి హాజరయ్యారు. స్ధానిక ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్, చైర్మన్ భాగ్యలక్ష్మి ఇతర వైసిపి నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపారు.
ఏపీ విద్యుత్ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగుల పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. విజయవాడ ధర్నా చౌక్ లో ధర్నాకు అనుమతి కోరుతూ.. ఏపీ విద్యుత్ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులు పిటిషన్ దాఖలు చేశారు.
రేపటి (బుధవారం ) నుంచి లోక కళ్యాణార్ధం, భక్తజన శ్రేయస్సు కోసం విజయవాడలోని ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో పవిత్రోత్సములు స్టార్ట్ కానున్నాయి. ఈ పవిత్రోత్సముల నేపథ్యంలో మూడు రోజుల పాటు ఆలయంలో జరిగే అన్ని ప్రత్యేక్ష పరోక్ష సేవలను ఆలయాధికారులు నిలిపేశారు.
శ్రావణ మాసంలో బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు మహిళలు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. దీనికి తోడు ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం దుకాణాలు ఫుల్ రద్దీగా మారాయి. అయితే, బంగారం, వెండి కొనుగోలు చేసే వారికి కాస్త ఊరట దొరికింది.