MB. Patil : మైసూరు శాండిల్ కోసం తమన్నాని ఎందుకు ఎంపిక చేశారో వెల్లడించిన కర్ణాటక మంత్రి ఎంబి పాటిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ (KSDL) తన ఐకానిక్ బ్రాండ్ మైసూర్ శాండల్ సోప్ ప్రచారకర్తగా నటి తమన్నా భాటియాను తీసుకుంది. అయితే, స్థానిక కన్నడ నటీమణులను కాదని ముంబైకి చెందిన తమన్నాను ఎంచుకోవడంపై సోషల్ మీడియాలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తమన్నా ఎంపిక వెనుక ఉన్న అసలు కారణాలను మంత్రి ఎం.బి. పాటిల్ వెల్లడించారు. ఎం.బి. పాటిల్ మీడియాతో మాట్లాడుతూ ‘బ్రాండ్ అంబాసిడర్ ఎంపిక ప్రక్రియలో సూపర్ స్టార్ రజనీకాంత్ సభ్యుడిగా ఉన్న ఒక ఉన్నత స్థాయి కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. కమిటీ సుమారు 5 నుండి 6 పేర్లను పరిశీలించింది, అందులో కర్ణాటకకు చెందిన 2-3 పేర్లు కూడా ఉన్నాయి. అయితే వారు ఇప్పటికే ఇతర పోటీ బ్రాండ్లకు అంబాసిడర్లుగా ఉన్నందున, నిబంధనల ప్రకారం వారిని పరిగణనలోకి తీసుకోలేదు.
Also Read : Doctor Actresses : యాక్టింగ్ చేస్తూ డాక్టర్ పట్టా పొందిన హీరోయిన్స్ వీళ్ళే?
Also Read
- Redmi Smart Phone: 1.5K AMOLED డిస్‌ప్లే, 10,000mAh బ్యాటరీ.. రెడ్ మీ నుంచి అదిరిపోయే స్మార్ట్ ఫోన్..
- Minister Satya Kumar: కొత్త పార్టీ పెట్టుకో.. కానీ ముందు ప్రజలకు ఆ లెక్క చెప్పు..
- Mallikarjun Kharge: ఫలించిన కాంగ్రెస్ పోరాటం.. ఖర్గే ర్యాలీ తర్వాత శుద్ధి చేసిన ఘటనపై ఎఫ్ఐఆర్
- Putin: బ్రిక్స్‌కు ముందే ఢిల్లీకి వస్తున్న పుతిన్.. కారణమిదే!
కన్నడ మూలాలున్న గ్లోబల్ స్టార్ దీపికా పదుకొనేను కూడా ఈ రేసులో పరిశీలించాము, కానీ ఆమె డిమాండ్ చేసిన పారితోషికం ప్రభుత్వ బడ్జెట్ పరిమితులను మించి ఉంది. అలాగే దీపికకు స్వంత బ్యూటీ బ్రాండ్ ఉండటం కూడా ఆమెను తీసుకోకపోవడానికి ఒక కారణం. రాష్మిక మందన్న, శ్రీలీల వంటి మరికొంత మంది నటీమణులు కూడా ఇతర బ్రాండ్లతో బిజీగా ఉండటం వల్ల తమన్నా వైపు మొగ్గు చూపాల్సి వచ్చింది. “ఇది కేవలం వ్యాపార పరమైన నిర్ణయం మాత్రమే. మైసూర్ శాండల్ సోప్ అమ్మకాలు కేవలం కర్ణాటకకే పరిమితం కాలేదు. తెలంగాణలో 18%, ఉత్తర భారతదేశంలో 8%, అంతర్జాతీయంగా 1% మార్కెట్ ఉంది. 2030 నాటికి రూ. 5,000 కోట్ల టర్నోవర్ సాధించడమే మా లక్ష్యం” అని మంత్రి తెలిపారు. తమన్నాకు ఉన్న పాన్-ఇండియా క్రేజ్ మరియు కోట్లాది మంది సోషల్ మీడియా ఫాలోవర్లు బ్రాండ్ ప్రమోషన్‌కు బాగా ఉపయోగపడతారని ప్రభుత్వం భావిస్తోంది.
తాజావార్తలు
-
Redmi Smart Phone: 1.5K AMOLED డిస్‌ప్లే, 10,000mAh బ్యాటరీ.. రెడ్ మీ నుంచి అదిరిపోయే స్మార్ట్ ఫోన్..
-
Pan India Star: పాన్ ఇండియా కూడా పాతదైపోయిందా? హీరోలకు నెక్ట్స్ ట్యాగ్ ఏంటి?
-
Minister Satya Kumar: కొత్త పార్టీ పెట్టుకో.. కానీ ముందు ప్రజలకు ఆ లెక్క చెప్పు..
-
KTR : రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ సంచలన కామెంట్స్..
-
Mallikarjun Kharge: ఫలించిన కాంగ్రెస్ పోరాటం.. ఖర్గే ర్యాలీ తర్వాత శుద్ధి చేసిన ఘటనపై ఎఫ్ఐఆర్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!