Vangaveeti Radha Marriage: వంగవీటి ఇంట పెళ్లి భాజాలు.. రాధా పెళ్లి ముహూర్తం ఎప్పుడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vangaveeti Radha Marriage: వంగవీటి అనే పేరు తెలుగు రాష్ట్రాల్లో తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు.. దానికి ప్రధాన కారణం వంగవీటి రంగా.. ఇక, ఆయన కుమారుడు వంగవీటి రాధా కృష్ణ కూడా రాజకీయాల్లో.. తన కమ్యూనిటీలో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ముఖ్యంగా విజయవాడలో వంగవీటి ఫ్యామిలీకి పెద్ద ఎత్తున అనుచరులున్నారు.. అయితే, వంగవీటి ఫ్యామిలీని అభిమానించేవారికి, వంగవీటి రాధా కృష్ణ పెళ్లి ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్నవారికి శుభవార్త.. ఎందుకంటే.. వంగవీటి ఇంట పెళ్లి భాజాలు మోగనున్నాయి.. ఇప్పటికే రెండు కుటుంబాలు పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నాయి..
Read Also: Cinema At Manipur: మణిపూర్‌లో 23 ఏళ్ల తరువాత.. హిందీ సినిమా ప్రదర్శన
Also Read
- Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
- Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
- Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
మొదట ఈ నెల 19వ తేదీన వంగవీటి రాధా-జక్కం పుష్పవల్లీల నిశ్చితార్థం ఘనంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.. కానీ, పలు కారణాల వల్ల ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది.. పెళ్లి మాత్రం ముందుగా నిర్ణయించిన మూహూర్తానికి అంటే సెప్టెంబర్ 6న జరిపించనున్నారు.. వంగవీటి ఫ్యామిలీ అంటే రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం.. ఆ ఫ్యామిలీతో వియ్యం అందుకునేది ఎవరు? అనే చర్చ ఆసక్తికరంగా సాగుతుంది.. అయితే, వంగవీటి రాధాకు కాబోయే భార్య.. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురంకు చెందిన అమ్మాయి. నర్సాపురం పట్టణానికి చెందిన యువతితో రాధాకృష్ణకు వివాహం నిర్ణయించారు. తన మిత్రుడికి దగ్గర బంధువుల అమ్మాయితో ఈ వివాహం నిశ్చయం అయినట్లుగా తెలుస్తోంది. ఆమె ఎవరో కాదు.. నరసాపురం మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ జక్కం ఆమ్మాణి, బాబ్జీల చిన్నకుమార్తె జక్కం పుష్పవల్లీ.. ఇప్పటికే రెండు కుటుంబాలు పెళ్లి విషయంపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు.. ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారని చెబుతున్నారు.
Read Also: Mancherial: శరణ్య హత్య కేసులో ట్విస్ట్.. బయట పడ్డ భర్త ఆడియో..!
మొదట నర్సాపురంలో ఈ నెల 19వ తేదీన వధువ ఇంట నిశ్చితార్థం నిర్వహించి.. సెప్టెంబర్ 6వ తేదీన విజయవాడలో పెళ్లి జరిపించాలనుకున్నారు.. కానీ, పలు కారణాలవల్ల రాధా నిశ్చితార్థం రద్దు చేసుకున్నారట.. సెప్టెంబర్ 6వ తేదీన నేరుగా వివాహానికి సిద్ధమయ్యారు.. బెజవాడలో వంగవీటి రాధా-పుష్పవల్లీ వివాహం ఘనంగా నిర్వహించాలన వంగవీటి ఫ్యామిలీ ఏర్పాట్లలో మునిగిపోయిందట.. ఇక, ఇటీవల ప్రధాన అనుచరులతో భేటీ కూడా ఇదే విషయం చెప్పటానికి ఓ సమావేశం ఏర్పాటు చేశారట వంగవీటి రాధా.. ఈ సమాచారం మీడియా వరకు వెళ్లడంతో.. సమావేశం రద్దు చేసి.. ఆత్మీయులకు మాత్రమే వివాహ విషయం తెలిపారట రాధా సన్నిహితులు. మొత్తంగా వంగవీటి ఇంట పెళ్లి భాజాలు మోగనున్నాయి. పార్టీలకు అతీతంగా వంగవీటి ఫ్యామిలీకి అభిమానులు ఉన్నారు.. వివిధ పార్టీలకు చెందిన ప్రముఖులు ఈ పెళ్లికి హాజరయ్యే అవకాశం లేకపోలేదు.
తాజావార్తలు
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Attahaasam : వెంకటేష్ మహా కమర్షియల్ సినిమా అట్టహాసం.. హిట్టు కొడతాడో లేదో
-
Mandhana-Harmanpreet: హర్మన్‌ప్రీత్, మంధాన మధ్య విభేదాలు.. రెండుగా విడిపోయిన భారత డ్రెస్సింగ్ రూమ్?
-
Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
ట్రెండింగ్
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!