పది రోజులు లండన్ టూర్ ముగించుకుని ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. సీఎం జగన్ కు మంత్రులు జోగి రమేష్, విశ్వరూప్, డీజీపీ, సీఎస్, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు.
నేడు మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో జనసేన పీఏసీ సమావేశం కానుంది. ఈ మీటింగ్ కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ హాజరుకానున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు సమావేశం జరుగనుంది.
Udayanidhi Stalin: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు ఆ రాష్ట్ర మంత్రిగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ ‘సనాతన ధర్మం’పై చేసిన వ్యాఖ్యలు మంటలు రేపుతూనే ఉన్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆయన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. బీజేపీ ఉదయనిధి క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తోంది. డీఎంకే పార్టీ ఇండియా కూటమిలో ఉండటంతో, ఆ కూటమికి హిందూమతంపై ద్వేషం ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.