CM YS Jagan Started Hayath Place Hotel In Vijayawada: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తాము వరల్డ్ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గుణదలలో కొత్తగా నిర్మించిన హయత్ ప్లేస్ హోటల్‌ను ప్రారంభించిన అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ.. ఏపీలో మంచి బ్రాండ్ ఉన్న హోటళ్లు రావాలని ఆకాంక్షించారు. గ్లోబల్ ప్లాట్‌ఫాం మీద ఏపీలో టూరిజాన్ని ప్రోత్సహించే విధంగా టూరిజం పాలసీని రూపొందించామని తెలిపారు. 11 ప్రముఖ ప్రాంతాల్లో హోటళ్ల నిర్మాణాలకు అనుమతులిచ్చి ప్రోత్సాహకాలిచ్చామని చెప్పారు. మరిన్ని హోటళ్లు రావాలని పిలుపునిచ్చిన ఆయన.. వారికి ప్రభుత్వ పరంగా ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు. విజయవాడ ఒక్కటే కాకుండా ఏపీ వ్యాప్తంగా ఇలాంటి హోటల్స్ రావాలన్నారు.
కాగా.. టూరిజం పాలసీలో భాగంగా హయత్ ప్లేస్ హోటల్‌కు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. టూరిజం పాలసీలో నిర్మాణం పూర్తి చేసుకున్న తొలి హోటల్ ఇదే. ఈ సందర్భంగా హయత్ ప్లేస్ చీఫ్ స్వామి మాట్లాడుతూ.. టూరిజం పాలసీలో భాగంగా హోటల్ రంగాన్ని ప్రభుత్వం ప్రోత్సాహిస్తోందన్నారు. మొత్తం 11 హోటళ్లకు అనుమతిస్తే.. అందులో నిర్మాణం పూర్తి చేసుకున్న తొలి హోటల్ హయత్ ప్లేస్ అని చెప్పారు. తమ హోటల్ నిర్మాణం త్వరితగతిన పూర్తయ్యేలా ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందించిందన్నారు. పెట్టుబడులకు ఏపీని స్వర్గధామంగా తీర్చిదిద్దడంలో ప్రభుత్వ ప్రొత్సహం అద్భుతంగా ఉందని కొనియాడారు. ఈ ప్రారంభోత్సనానికి మంత్రులు బొత్స, రోజా, తానేటి వనిత, ఉన్నతధికారులు రజత్ భార్గవ, తదితరులు హాజరయ్యారు.
Viral Video: యువతికి వేధింపులు.. పంచాయతీ తీర్పుతో చెప్పుతో కొట్టిన అమ్మాయి