Bhandi Sanjay: బండి సంజయ్ విజయవాడ పర్యటన రద్దు.. కారణం ఇదీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhandi Sanjay: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విజయవాడ పర్యటన రద్దైంది. హైదరాబాద్-గన్నవరం ఫ్లైట్ 4 గంటలు ఆలస్యం కావడంతో పర్యటన రద్దు చేసుకున్నట్లు బీజేపీ శ్రేణులు వెల్లడించారు. మధ్యాహ్నం ఒంటి గంటకు వర్చువల్ ద్వారా ఓటర్ చేతన్ అభియాన్ కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొని ప్రసంగించునున్నారు.
తెలంగాణ బీజేపీ నేత బండి సంజయ్ ఏపీ పార్టీ వ్యవహారాలను తీసుకుంటున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన బండి సంజయ్‌ను పార్టీలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో తొలగించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ నియమితులయ్యారు. ఏపీ పార్టీ రాష్ట్ర ఇంచార్జిగా బండిని నియమిస్తారని ప్రచారం జరుగుతుండగానే సంజయ్ ఈ నెల 21న ఏపీకి పర్యటన సంచలనంగా మారింది.. బండి సంజయ్ ఈ నెల 21న విజయవాడ పర్యటనకు వెళుతున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఏపీలో ఓటర్ల నమోదు ప్రక్రియను సమీక్షించనున్నట్లు తెలిపారు. కాగా.. ఐదు రాష్ట్రాల ఓటర్ల నమోదు ప్రక్రియ బాధ్యతలను పార్టీ నాయకత్వం ఆయనకు అప్పగించింది. మహారాష్ట్ర, గోవా, ఒడిశా, ఏపీలో బండిసంజయ్ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. ఏపీకి చెందిన పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తమిళనాడు, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరిలో ఓటరు నమోదుకు బాధ్యత వహిస్తారు. తెలంగాణ రాష్ట్రానికి పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు రేఖా వర్మ నియమితులయ్యారు. ఇప్పుడు ఏపీలో బీజేపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.
Also Read
- Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
- Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
Read also: Minister Errabelli: మంత్రి సంతకం ఫోర్జరీ.. లెటర్ హెడ్‌తో బోగస్ సిఫార్స్ లేఖ
అయితే జనసేనతో పొత్తు కొనసాగిస్తున్న బీజేపీ, టీడీపీల విషయంలో మాత్రం క్లారిటీ లేదు. వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు. టీడీపీతో పొత్తుపై ఏపీ బీజేపీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో టీడీపీతో పొత్తు అక్కర్లేదని నేతలు బీజేపీ నాయకత్వానికి స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ బీజేపీ ఇంచార్జ్‌గా పనిచేసిన సునీల్ దేవధర్‌ను పార్టీ వీడింది. ఇప్పుడు ఆయన స్థానంలో బండి సంజయ్‌కు బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. దీని ద్వారా అటు తెలంగాణ, ఇటు ఏపీలోనూ బండి సంజయ్ సేవలను వినియోగించుకోవాలని పార్టీ భావిస్తోంది. పొత్తు రాజకీయాలు జరుగుతున్న తరుణంలో.. సొంతంగా పార్టీని ఎదగాలని భావిస్తున్న బండి సంజయ్ కు బాధ్యతలు అప్పగిస్తే ఎలాంటి రాజకీయ సమీకరణాలు చోటు చేసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది. అయితే పలు కారణాల వల్ల పర్యటన రద్దుకావడంతో కీలకంగా మారింది. అయితే ఇవాళ మధ్యాహ్నం వర్చువల్ ద్వారా ఓటర్ చేతన్ అభియాన్ కార్యక్రమంలో బండి సంజయ్ ఏం మాట్లాడనున్నారనే దానిపై ఆసక్తి నెలకొంది.
SIM Cards: మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసా?.. చెక్ చేసుకోండి ఇలా!
తాజావార్తలు
-
Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్‌కు బిగ్ షాక్.. సగం ధరకే విక్రయం!
-
Lagadapati Sridhar: చిన్న సినిమాలను తొక్కేస్తున్నారా? లగడపాటి శ్రీధర్ సంచలన కామెంట్స్!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Sourav Ganguly: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. ‘దాదా గిరి’ మొదలైంది!
-
Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
ట్రెండింగ్
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!