హైదరాబాద్- విజయవాడ జాతీయరహదారి పైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం ఐతవరం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై మున్నేరు వరద నీరు ఉద్ధృతంగా వస్తోంది. దీంతో ఏపీ, తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇక, జాతీయ రహదారిపై వందలాదిగా వెహికల్స్ రెండు వైపులా నిలిచిపోయాయి. దాదాపు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి.
ఏపీ అంటే ఆక్వా హబ్ అని.. ఏటా సగటున ఒక వ్యక్తి 8 కేజీల ఫిష్ వినియోగిస్తున్నారని ఏపీ మత్స్యశాఖ కమిషనర్ కన్నబాబు అన్నారు. ఏపీలో చేపల ఉత్పత్తి ఎక్కువగా ఉందన్న ఆయన.. వినియోగం తక్కువగా ఉందన్నారు. ఆక్వా ఉత్పత్తుల వినియోగం పెంచాలన్నారు. ఈ నెల 28 నుంచి 30 వరకు మూడు రోజుల పాటు విజయవాడ వేదికగా సీ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నామని ఆయన తెలిపారు.
Volunteers Police Complaint Against Pawan Kalyan: ఏపీలో అధికారమే లక్ష్యంగా పూర్తిగా రాజకీయాల మీద ఫోకస్ పెట్టారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రస్తుతం రెండో విడత వారాహి యాత్ర చేస్తున్న ఆయన ఒక పక్క అధికార పార్టీ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోని గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థను లక్ష్యంగా చేసుకున్నాడు. వాలంటీర్ వ్యవస్థ మానవ అక్రమ రవాణాకు తోడ్పడుతుందని…
తోటి వ్యాపారులపైనే దాష్టీకానికి పాల్పడ్డారు. బకాయిలు అడిగినందుకు దుర్మార్గంగా వ్యవహరించారు. విచక్షణ మరిచి.. బట్టలు ఊడదీసి కొట్టారు. ఆపై వీడియోలు రికార్డు చేసి వికృత చేష్టలకు పాల్పడ్డారు.
తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. కర్ణాటక ఎన్నికల తర్వాత అటు ఏపీ, ఇటు తెలంగాణలో ముమ్మరంగా కార్యక్రమాలు చేపడుతోంది. తెలంగాణలో అయితే కాంగ్రెస్ నాయకులు పాదయాత్ర చేపట్టారు. కొన్ని రోజులు క్రితం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయగా.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా పాదయాత్ర చేపట్టారు.