YSRCP: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల హడావుడి స్టార్ట్ అయిపోయింది. పాలక, ప్రతిపక్షాలు వరుస కార్యక్రమాలతో దూసుకుపోతున్నాయి.. ఇక, అధికార పార్టీ మరింత దూకుడు పెంచేసింది.. సార్వత్రిక ఎన్నికల్లో బరిలోకి దిగే అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటిస్తున్నారు.. విజయవాడలోని మూడు అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఈ రోజు ప్రకటించారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. విజయవాడ పాతబస్తీ పంజాసెంటర్ లో నిర్వహించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు.. సీసీ రోడ్లు వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.. ముఖ్య అతిథిగా హాజరైన సజ్జల మాట్లాడుతూ.. 2024 ఎన్నికల్లో వెలంపల్లి శ్రీనివాస్‌ని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి గెలిపించాలని పిలుపునిచ్చారు.. ఇక, విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి దేవినేని అవినాష్, విజయవాడ సెంట్రల్ నుంచి మల్లాది విష్ణులను కూడా గెలిపించాలని పిలుపునిస్తూనే.. ఆ ముగ్గురు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి.
Read Also: Mirnaa Menon: రజినీకాంత్ రీల్ కోడలు ఏంట్రా.. బయట ఇంత హాట్ గా ఉంది
ఇక, చంద్రబాబు, అతని ఆర్కెస్ట్రా టీం గురించి కూడా మాట్లాడుకుంటాం.. చంద్రబాబు దత్తకొడుకు, సొంతకొడుకు ఇక్కడ దగ్గరలోనే ఉన్నారు.. దత్త, సొంత కొడుకులు 2014-19 మధ్య ఏం చేసారో చెప్పుకోలేక.. ఏం చేస్తారో కొత్తగా చెప్పుకుంటున్నారు అంటూ ఎద్దేవా చేశారు సజ్జల.. జనానికి జ్ఞాపకశక్తి లేదని చంద్రబాబుకు అపారమైన నమ్మకం.. చంద్రబాబు చెపుతున్న దేనిలోనూ నిజాలు లేవని విమర్శించారు. ఓటర్లకు లంచం ఇచ్చినట్టుగా ఇచ్చాడు చంద్రబాబు 2019 ఎన్నికలకు.. ప్రజలను భ్రమలో పెట్టి ఐదేళ్ళు లాక్కొచ్చి కొడుక్కు అధికారం కట్టబెట్టాలని ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. లోకేష్ మాట్లాడటం ఇటీవలే ప్రాక్టీసు చేస్తున్నాడనుకుంటా.. రాజశేఖరరెడ్డిని చూసి నేర్చుకోమని చంద్రబాబుకు అతని చిన్నాయన చెప్పారట.. అడ్డదారులు, గోడలు దూకడం తెలిసిన చంద్రబాబు.. కొడుక్కు కూడా అదే నేర్పిస్తున్నాడు అంటూ సెటైర్లు వేశారు. అమరావతి పొలాల్లో ఉంది.. ఉన్న విజయవాడ మొండి గోడలతో వదిలేసాడు చంద్రబాబు అంటూ ఆరోపణలు గుప్పించారు. చంద్రబాబు, బినామీలు ఉంచుకున్న 30 వేల ఎకరాల కోసం కృష్ణాజిల్లా ఎండబెట్టాలని చూశాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. జనాన్ని ముంచి తీసే రియాల్టర్ లాగా చంద్రబాబు చేశాడని.. చంద్రబాబు, ఆయన బ్రోకర్ల కోసం కృష్ణాజిల్లాను తాకట్టు పెట్టాడని మండిపడ్డారు. కృష్ణాజిల్లా మొత్తం గ్రీన్ బెల్ట్ చేసి అభివృద్ధి లేకుండా చేశాడు.. నాశనం చేయడంలో చంద్రబాబు కు వరల్డ్ రికార్డు ఇవ్వొచ్చు అని దుయ్యబట్టారు. కోర్టు కేసులు పూర్తయితే R-5 స్ధలాలన్నీ అక్కచెల్లెమ్మల సొంత ఆస్థి అవుతుందని తెలిపారు సజ్జల రామకృష్ణారెడ్డి.