Babar Azam: ఇలా ఉన్నారేంట్రా? బాబర్‌పై లైవ్ టీవీలో పందేలు!.. ఘోరంగా అవమానించిన పాక్ మాజీ ప్లేయర్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Babar Azam: తమ ఇజ్జత్ తామే తీసుకోవడంలో పాకిస్థాన్‌కు ఎవరూ సాటి లేరు. ప్రస్తుతం మరోసారి పాకిస్థాన్‌లో ఈ వైఖరి కనిపించింది. ఒకప్పుడు పాకిస్థాన్ క్రికెట్‌కు బలమైన స్తంభంగా నిలిచిన బాబర్ ఆజమ్ పరిస్థితి దిక్కు తోచడం లేదు. ఇప్పుడు తన స్థానం కోసం పోరాడుతున్నాడు. టీ20 వరల్డ్ కప్ 2026లో నెదర్లాండ్స్‌పై తొలి మ్యాచ్‌లో 18 బంతుల్లో 15 పరుగులకే ఔటైన బాబర్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే అమెరికాపై జరిగిన మ్యాచ్‌లో 32 బంతుల్లో 46 పరుగులు చేసి తనపై వచ్చిన ఒత్తిడిని కొంత తగ్గించుకున్నాడు. అయినా సరే.. ఆదివారం భారత్‌తో జరిగే కీలక పోరులో బాబర్ ఎలా ఆడతాడన్న సందేహాలు వ్యక్త మవుతున్నాయి. ఈ నేపథ్యంలో బాబర్ మాజీ సహచరులే ఇప్పుడు బహిరంగంగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. లైవ్ టీవీలోనే సరదాగా, కాస్త వ్యంగ్యంగా పందేలు కడుతున్నారు.
READ MORE: Nara Lokesh: అసెంబ్లీ సమావేశాల వేళ కొత్త సంప్రదాయానికి నారా లోకేష్ శ్రీకారం!
Also Read
- AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
- Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
- Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
- Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!
పాకిస్థాన్ టీవీ చర్చలో అహ్మద్ షెహ్‌జాద్ మాట్లాడుతూ.. “బాబర్ ఆ మ్యాచ్‌ను పాకిస్థాన్‌కు గెలిపిస్తే, ఆ రోజు ప్రేక్షకులకు, సపోర్ట్ స్టాఫ్‌కి అందరికీ భోజనం నేనే పెడతా” అని అన్నాడు. దీంతో స్టూడియోలో నవ్వులు పూశాయి. “బాబర్ 160 స్ట్రైక్ రేట్‌తో పెద్ద ఇన్నింగ్స్ ఆడి పాకిస్థాన్‌ను గెలిపిస్తే, ఆమిర్ తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకుంటాడు” అని ఇక మహమ్మద్ ఆమిర్ ప్రకటించాడు. దీనిపై చర్చ కొనసాగగా, షెహ్‌జాద్ మధ్యలో జోక్యం చేసుకుని, “అంత పెద్ద సంఖ్యలు వద్దు.. 150కి పైగా స్ట్రైక్ రేట్‌తో 50కి పైగా పరుగులు చేసి మ్యాచ్ గెలిపిస్తే చాలు” అని షరతు పెట్టాడు. ఆమిర్ సైతం ఆ షరతుకు అంగీకరించాడు. ఈ వ్యాఖ్యలు సరదాగా చేసినా.. వాటి వెనుక ఉన్న సందేశం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. భారత్‌తో మ్యాచ్ అంటే ఎప్పుడూ ఒత్తిడి ఉంటుంది. అలాంటి వేళ బాబర్ నిజంగా మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడగలడా? అన్న ప్రశ్నకు ఇప్పటివరకు స్పష్టమైన సమాధానం లేదు. అయితే.. బాబర్ ఆజామ్ ఒకానొక సందర్భంలో పాకిస్థాన్ టీంకు సారథిగా ఉన్నాడు. అలాంటి వ్యక్తిపై లైవ్ టీవీలో వ్యంగ్యంగా పందేలు కట్టడం సిగ్గుచేటు అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. పాకిస్థాన్ బుద్ధి ఇక్కడే బయట పడుతుందని తిట్టిపోస్తున్నారు.
READ MORE: Doctor Actresses : యాక్టింగ్ చేస్తూ డాక్టర్ పట్టా పొందిన హీరోయిన్స్ వీళ్ళే?
Ex Pakistan Cricketers on Babar Azam
– Shehzad: Will host dinner if he plays a match winning knock vs India on Sunday.
– Amir: Says he will come out of Retirement.
– Rashid Latif: He does not bat that long Anyway.
— Shah (@Shahhoon1) February 11, 2026
తాజావార్తలు
-
AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
-
Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
-
Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
-
Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!
-
SBI ATM Rules Change: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. రేపటి నుంచి ATM నిబంధనల్లో కీలక మార్పులు
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?