Binoy Viswam: పార్లమెంట్‌లో బీజేపీ డాన్‌లాగా ప్రవర్తిస్తోందంటూ మండిపడ్డారు సీపీఐ జాతీయ కార్యదర్శి బినోయ్ విశ్వం.. విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో విశాఖ నుండి తిరుపతి వరకు సీపీఐ చేపట్టనున్న బస్సు యాత్ర పోస్టర్ రిలీజ్ చేశారు.. సీపీఐ నేతలు ఆగష్టు 17 నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు బస్సు యాత్ర నిర్వహించబోతున్నారు.. అయితే, పోస్టర్ రిలీజ్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోని కార్మికులకు రక్షణ కల్పించడం ప్రభుత్వాల ప్రధాన బాధ్యత.. ఉద్యోగులు, కార్మికులు మరణించినప్పుడు చిన్నపాటి సహాయం చేయడం కాదు.. ప్రభుత్వాలు మరణించిన ఉద్యోగులు, కార్మికుల కుటుంబాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
Read Also: Rajini: జైలర్ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో పెరగనున్న థియేటర్స్
ఇక, బీజేపీ ప్రభుత్వం వల్ల పార్లమెంట్ సెషన్స్ పూర్తిగా విలువ లేకుండా పోయాయని మండిపడ్డారు బినోయ్ విశ్వం… పార్లమెంట్ లో బీజేపీ డాన్ లాగా ప్రవర్తిస్తోందని ఫైర్ అయ్యారు. బీజేపీ పార్లమెంట్ ను ఒక నాన్సెన్స్ గా మార్చేసిందని దుయ్యబట్టారు. మణిపూర్ అంశంపై చర్చించాలని పట్టుబట్టాం.. కానీ, బీజేపీ ప్రభుత్వం చర్చకు తేలేదు.. బీజేపీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం అందరితో కలిసి పెట్టాం.. అవిశ్వాస తీర్మానం కారణంగా మోడీ పార్లమెంట్‌కు వచ్చారని తెలిపారు. మణిపూర్ అంశంలో కేంద్రం.. రేపిస్టుల తరఫున నిలబడుతోందని ఆరోపించారు. ప్రధాని, కేంద్ర ప్రభుత్వం మార్చాల్సిందే అని పిలుపునిచ్చారు. మరోవైపు, కేరళ మినహా మిగతా రాష్ట్రాలలో లెఫ్ట్ పార్టీలు బలహీనంగా ఉన్నాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక, పార్లమెంట్‌లో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ స్పీచ్ హాస్యాస్పదంగా ఉందని మండిపడ్డారు.. రాహుల్ గాంధీ ఫ్లైయింగ్ కిస్ ఇచ్చాడు.. అది ఒక ఫ్లైయింగ్ కిస్ మాత్రమే.. కానీ, దానిని రాద్ధాంతం చేయడం ఏంటి? అంటూ ఎద్దేవా చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి బినోయ్ విశ్వం.