విజయవాడలో జరుగుతున్న బీజేపీ ప్రజాగ్రహ సభలో ఏపీ సర్కారుపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శలు చేశారు. కేంద్రం డబ్బిస్తే గ్రామ సచివాలయాలు కట్టి స్తోత్రం.. స్తోత్రం అంటూ జగనన్న జపం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ ప్రజాగ్రహ సభ అంటే కొందరికి కాలాల్సిన చోట కాలిందని.. మంత్రి పేర్ని నాని ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. మరోవైపు జగన్‌ను ప్రసన్నం చేసుకునేందుకే ప్రజాగ్రహ సభ పెట్టారని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ అంటున్నారని.. ఈ సభ ద్వారా…
పోలీసులు ఎంతగా హెచ్చరిస్తున్నా ప్రజల్లో మార్పు రావడం లేదు. సైబర్‌నేరగాళ్ల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని ఎన్ని సార్లు హెచ్చరించిన మోసపోతునే ఉన్నారు. తాజాగా ఏపీలో ఆన్‌లైన్ పరికరాల పేరిట ప్రజలను బురిడీ కొట్టించారు. లవ్ లైఫ్ డ నేచురల్ హెల్త్ కేర్ ముసుగులో రూ.200 కోట్లకు టోకరా వేశారు కేటుగాళ్లు. ఈ కంపెనీ పేరిట రూ.500 నుంచి రూ.2 లక్షల వరకు హెల్త్ పరికరాలను ఆన్‌లైన్‌లో ఆ సంస్థ పెట్టింది. ఒక్కో పరికరానికి రీచార్జ్ పేరుతో…
విజయవాడలోని నొవాటెల్ హోటల్‌లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో సీజేఐ జస్టిస్ ఎన్వీరమణ పాల్గొన్నారు. హోటల్‌కు చేరుకున్న బిషప్‌లు, క్రైస్తవ మత పెద్దలు క్రిస్మస్ సందర్బంగా సీజేఐతో కేక్ కట్ చేయించారు. బిషప్‌లకు జస్టిస్ ఎన్వీరమణ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ తినిపించారు. వేడుకల్లో ఎపి, తెలంగాణ హైకోర్టు సీజేలు .. జడ్జిలు తదితర ఉన్నతాధికారులు పాల్గన్నారు. మరోవైపు నోవాటెల్ హోటల్‌లో ఉన్న సీజేఐని కలిసేందుకు ప్రముఖులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. సీజేఐ రాష్ర్ట పర్యటనలో ఉన్న సంగతి…
ఏపీ మైనార్టీ శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో సెమీ క్రిస్మస్ వేడుకల్లో మంత్రలు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం అంజాద్ భాషా, మంత్రులు ఆదిమూలపు సురేష్, తానేటి వనిత, బాపట్ల ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ నందిగం సురేష్ మాట్లాడారు.ఇతరులకి సహాయపడటమే నిజమైన పండుగ అని ఆయన అన్నారు. మాటకోసం పనిచేసే ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ప్రజలకోసం పనిచేసే…
కొన్నిరోజులుగా విజయవాడ పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్న చెడ్డీ గ్యాంగ్ ఎట్టకేలకు చిక్కింది. గుజరాత్‌లో నిఘా వేసిన విజయవాడ పోలీసులు చెడ్డీ గ్యాంగ్‌కు చెందిన ముగ్గురు సభ్యులను అరెస్ట్ చేసి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. అరెస్ట్ అయిన వారిలో గుజరాత్‌లోని దాహోద్ జిల్లా గుల్చర్ గ్రామానికి చెందిన మడియా కాంజీమేడా, సక్ర మండోడ్, మధ్యప్రదేశ్‌కు చెందిన కమలేష్ బాబేరియా అలియాస్ కమలేష్ అలియాస్ కమ్లా జుబువా ఉన్నారు. పరారీలో ఉన్న మిగిలిన ఏడుగురి కోసం గుజరాత్‌లోనే ఉన్న మరో పోలీసుల…
రైల్వే ప్రయాణికులకు ఐఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఉత్తర భారతదేశం సందర్శించుకోవాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. విజయవాడ నుంచి పర్యాటకుల కోసం ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు IRCTC డిప్యూటీ జనరల్ మేనేజర్ కిషోర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వీటికి సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. కొత్త ఏడాదిలో మూడు నెలల పాటు 3 ప్రత్యేక టూరిస్ట్ ట్రైన్లు ప్రారంభిస్తున్నామన్నారు. తీర్థయాత్ర ప్రత్యేక పర్యాటక రైలు ద్వారా గుజరాత్ యాత్ర ప్రారంభం కానుందని తెలిపారు. మొదటి టూర్…
“అఖండ” భారీ విజయాన్ని అందుకోవడంతో చిత్రబృందం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ‘అఖండ’ హీరో బాలకృష్ణ సినిమా దర్శకుడు బోయపాటి, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డితో కలిసి తాజాగా ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బాలయ్య ఆన్‌లైన్ టిక్కెటింగ్ జీవోను రద్దు చేస్తూ ఏపీ హైకోర్ట్ ఇచ్చిన ఆదేశాలపై స్పందించారు. Read also : దుర్గమ్మ సేవలో బాలయ్య… ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక పూజలు బాలయ్య ఆన్‌లైన్ టిక్కెటింగ్ విధానంపై మాట్లాడుతూ “ఆ…
నందమూరి బాలకృష్ణ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు. బాలకృష్ణతో పాటు దర్శకుడు బోయపాటి శ్రీను కూడా అమ్మవారి ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. బాలయ్యకు ఆలయ మర్యాదలతో దుర్గగుడి అధికారులు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు బాలయ్య. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారి చిత్రపటంతో పాటు వేద ఆశీర్వచనం అందించారు. బాలకృష్ణ నటించిన “అఖండ” చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో బాలయ్య అమ్మవారిని దర్శించుకున్నారు. “అఖండ” చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించగా,…
విజయవాడలో చెడ్డీ గ్యాంగ్ ఈ మధ్య కలకలం సృష్టిస్తోంది… విజయవాడ, అమరావతి, తాడేపల్లి ప్రాంతాల్లో పలు చోట్ల చోరీలకు పాల్పడింది చెడ్డీ గ్యాంగ్.. దీంతో రంగంలోకి దిగిన బెజవాడ పోలీసులు… ఈ కేసులో పురోగతి సాధించారు.. రెండు గ్యాంగ్‌లకు చెందిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.. చెడ్డీ గ్యాంగ్ చోరీ ఘటనల సీసీటీవీ ఫుటేజీని గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు కూడా పంపించారు బెజవాడ పోలీసులు. తాడేపల్లి చోరీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలోని చెడ్డీ గ్యాంగ్ సభ్యులను గుజరాత్ పోలీసులు…