వంగవీటి రాధా ఎపిసోడ్ ఇప్పుడు ఏపీలో చర్చగా మారింది.. తనను హత్య చేయడానికి రెక్కీ నిర్వహించారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయన.. తననేదో చేద్దామని కుట్ర చేశారని.. దేనికీ భయపడనని పేర్కొన్నారు.. తాను ప్రజల మధ్య ఉండే మనిషినని చెప్పిన రాధా.. అన్నింటికీ సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు.. దీనిపై పెద్ద చర్చే జరిగింది.. చివరకు ప్రభుత్వం వెంటనే రాధాకు 2+2 గన్‌మన్ల భద్రత కూడా కల్పించింది. రాధా భద్రతపై సీఎం వైఎస్ జగన్ సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసినట్టు మంత్రి కొడాలి నాని కూడా వెల్లడించిన సంగతి తెలిసిందే.
అయితే, ఆ గన్‌మన్లను రాధా తిరస్కరించారంటూ వార్తలు వచ్చాయి.. దీనిపై మీడియా చిట్‌చాట్‌లో ఆయనే క్లారిటీ ఇచ్చారు.. గన్‌మన్లను వద్దని చెప్పిన మాట నిజమేనన్నారు వంగవీటి రాధా.. తాను నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తిని.. అందుకే సెక్యూరిటీ వద్దు అన్నట్టు చెప్పుకొచ్చారు. అయితే, అన్ని పార్టీ నేతలు తన క్షేమంపై ఆరా తీశారన్నారు రాధా.. ఈ వ్యవహారంలో పోలీసులు ఇప్పటి వరకు తన దగ్గరకు రాలేదని.. వస్తే స్పందిస్తానని తెలిపారు.