ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిధుల వ్యవహారంలో ఉద్యోగులు నిరసన బాట పట్టారు.. మరోవైపు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీలో నిధుల బదలాయింపు ప్రక్రియ పూర్తి చేశారు అధికారులు.. రూ. 400 కోట్ల మేర వర్శిటీ నిధులను ఫైనాన్షియల్ సర్వీసు కార్పొరేషనులోకి బదలాయించారు వీసీ.. బదలాయింపు ప్రక్రియను వ్యతిరేకిస్తూ ఓవైపు యూనివర్శిటీ ఉద్యోగుల ఆందోళన చేస్తున్నా.. ఈ ప్రక్రియను మాత్రం ఆపలేకపోయారు.. ఇక, ఈ వ్యవహారాన్ని తప్పుబడుతున్న ఉద్యోగులు విధులు బహిష్కరించి.. యూనివర్శిటీ ప్రారంగణంలో బైఠాయించారు. ఫైనాన్స్ కార్పొరేషన్ క్రెడిబిలిటీపై…
విజయవాడ నగరంలో చెడ్డీ గ్యాంగ్ సంచరిస్తోందన్న వార్తలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. టూటౌన్ పరిధిలో చెడ్డీ గ్యాంగ్ తిరుగుతున్నట్లు సీసీ కెమెరాల్లో దృశ్యాలు రికార్డయ్యాయి. అయితే చెడ్డీ గ్యాంగ్ ఎలాంటి కార్యకలాపాలకు పాల్పడుతుందన్న విషయంపై పోలీసులకు స్పష్టత అందాల్సి ఉంది. చెడ్డీ గ్యాంగ్ సంచారంపై ఇప్పటికే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వారి వల్ల ఎవరికైనా నష్టం కలిగితే ప్రజలు వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. Read Also: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు…
విజయవాడకు కొత్తబాస్ వచ్చారు. ఇప్పటివరకూ సీపీగా బాధ్యతలు చేపట్టి రిటైరయ్యారు శ్రీనివాసులు. సంతృప్తికరంగా నా పదవీ విరమణ చేస్తున్నా అన్నారాయన. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, డీజీపీ గౌతమ్ సవాంగ్ కి కృతజ్ఞతలు తెలిపారు. నాతో కలిసి పని చేసిన సిబ్బందికి తోటి ఆఫీసర్లకు ధన్యవాదాలు చెప్పారు. రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, మీడియాకు ధన్యవాదాలు అన్నారు శ్రీనివాసులు. మరో వైపు ఇన్ ఛార్జ్ సీపీ పాలరాజు మాట్లాడారు. బత్తిన శ్రీనివాసులు పోలీసు శాఖకు ఎనలేని సేవ చేశారు.…
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అంశంపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు నిధులు మాయమయ్యాయని చేస్తున్న ఆందోళనపై ఆయన మాట్లాడారు. హెల్త్ యూనివర్సిటీ అంశం నా పరిధిలో లేదు. హెల్త్ యూనివర్సిటీ నిధుల జోలికి ప్రభుత్వం పోదన్నారు. గత టీడీపీ ప్రభుత్వం ఆర్జేయూకేటీ యూనివర్సిటీ నుంచి150 కోట్ల రూపాయలను ఎన్నికల సమయంలోపసుపు కుంకుమ కింద మళ్లించిందని ఆయన ఆరోపించారు. ఆ లోటు నుంచి ఇప్పటికీ ఆర్జేయూకేటీ యూనివర్సిటీ కోలుకోలేదన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ…
ఏపీ, తెలంగాణలో ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. దీంతో హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,140గా నమోదైంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,040గా పలుకుతోంది. వెండి కూడా పసిడి బాటలో స్వల్పంగా తగ్గింది. కిలో వెండి రూ.700 తగ్గి ప్రస్తుతం రూ.67,200గా నమోదైంది. అటు విజయవాడలో 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.49,140గా.. 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం ధర రూ.45,040గా నమోదైంది. కిలో వెండి…
డబ్బు కోసం ఎంత నీచానికైనా ఒడిగడుతున్నారు కొందరు.. అందులో చదువుకున్నవారు కూడా ఉండడం సమాజానికి సిగ్గుచేటుగా మారింది. ఉన్నత చదువు చదువుకొని.. ఎంతోమందికి ఆదర్శంగా నిలవాల్సిన ఒక యువకుడు తక్కువకాలంలో ఎక్కువ డబ్బు సంపాదించడానికి అడ్డదారి తొక్కి జైలుపాలయ్యిన ఘటన విజయవాడలో వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే.. విజయవాడ ఫకీరుగూడెం కు చెందిన సోహైల్(21) అనే యువకుడు కష్టపడి చదువుకొని సాఫ్ట్ వేర్ గా పనిచేస్తున్నాడు. అయితే ఆ ఉద్యోగంలో ఆశించినంత డబ్బు రాకపోవడంతో అడ్డదారి పట్టాడు.…
విజయవాడలో హైలైఫ్ బ్రైడ్స్ అతిపెద్ద వివాహ, ఫ్యాషన్ మరియు లైఫ్స్టైల్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. విజయవాడలో మొట్టమొదటిసారిగా హైలైఫ్ బ్రైడ్స్ ప్రదర్శన నిన్న నోవొటెల్ విజయవాడ వరుణ్ వద్ద ప్రారంభమైంది. అయితే ఈ ప్రదర్శన 26,27 నవంబర్ 2021న.. అంటే ఈరోజు రేపు కూడా ఉంటుంది. • అయితే నోవొటెల్ , వరుణ్ వద్ద ఏర్పాటుచేసిన హై లైఫ్ బ్రైడ్స్ ప్రదర్శనలో… నటులు ఐశ్వర్య ఉల్లింగాల, యష్న చౌదరి, రితికా చక్రవర్తి తో పాటుగా అగ్రశ్రేణి మోడల్స్, ఫ్యాషన్…
పట్టణాభివృద్ధి విభాగంలో స్వచ్ఛ సర్వేక్షణ్-2021 ర్యాంకులను శనివారం నాడు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రకటించారు. ఈ ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాలు సత్తా చాటాయి. దేశంలో స్వచ్ఛ నగరంగా మధ్యప్రదేశ్లోని ఇండోర్కు మొదటి ర్యాంక్ దక్కింది. ఈ జాబితాలో గుజరాత్లోని సూరత్ రెండో ర్యాంకును, ఏపీలోని విజయవాడ 3వ ర్యాంకును దక్కించుకున్నాయి. ఏపీ నుంచి రెండు పట్టణాలు టాప్-10 జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఏపీలోని విశాఖపట్నం 9వ స్థానంలో నిలిచింది. టాప్-10 ర్యాంకులను పరిశీలిస్తే ఇండోర్, సూరత్, విజయవాడ,…
భార్య అంటే తనలో సగం. కష్టసుఖాల్లో తోడూనీడగా ఆమె భర్తకు వెన్నంటి వుంటుంది. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి వివాహం అనే మూడుముళ్ళు, ఏడడుగులతో భర్తతో పాటు పుట్టింటిని వదలి మెట్టినింటికి అడుగులు వేస్తుంది. అక్కడ ఏ కష్టం వచ్చినా భర్త అడుగుజాడల్లోనే నడుస్తోంది. భర్తకి కష్టం వస్తే ఆమె ఓదారుస్తుంది. భర్తతోటిదే లోకంగా బతుకుతుంది. కానీ, విధి వైచిత్రితో ఆ భార్య దూరం అయితే ఆ భర్త వేదనకు అంతే వుండదు. ఆమె గురుతులతో కాలం…
ఆంధ్రప్రదేశ్లో సౌర విద్యుత్ కొనుగోలుకు ఈఆర్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది… సెకీ నుంచి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోళ్లకు ఏపీ డిస్కంలకు ఈఆర్సీ అనుమతి ఇచ్చింది.. 2024 సెప్టెంబర్ నుంచి పాతికేళ్ల పాటు ఏడాదికి 17 వేల మిలియన్ యూనిట్ల మేర సెకీ నుంచి కొనుగోలు చేస్తామన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది ఈఆర్సీ.. సెప్టెంబర్ 2024 నాటికి 3 వేల మెగావాట్లు, సెప్టెంబర్ 2025 నాటికి మరో 3 వేలు, సెప్టెంబర్ 2026 నాటికి…