తన హత్యకు రెక్కీ జరుగుతోందని ఇటీవల టీడీపీ నేత వంగవీటి రాధా చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. ఈ నేపథ్యంలో విజయవాడలోని వంగవీటి రాధా కార్యాలయం ముందు గత కొన్నిరోజులుగా పార్క్ చేసిన స్కూటర్ అనుమానాస్పదంగా మారడంతో రాధా అనుచరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు స్కూటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. పార్క్ చేసిన స్కూటర్ ఎవరిదన్న దానిపై పోలీసులు విచారణ చేపట్టారు.
Read Also: బీమా కంపెనీల ఆఫర్… పెళ్లి క్యాన్సిల్ అయితే రూ.10 లక్షలు
అయితే ఈ స్కూటర్ నాని అనే వ్యక్తిది అని పోలీసుల విచారణలో వెల్లడైంది. అతడు వంగవీటి రాధా కార్యాలయం పక్కన ఉన్న ఓ స్వీట్ షాపులో పనిచేసే వ్యక్తి స్నేహితుడు అని పోలీసులు గుర్తించారు. దీంతో స్కూటర్‌ను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు అందులో ఏమీ లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. కాగా రెక్కీ ఆరోపణల నేపథ్యంలో వంగవీటి రాధా కార్యాలయాన్ని కూడా ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్యూరో పోలీసులు పరిశీలించారు. కాగా వంగవీటి రాధాకృష్ణకు టూ ప్లస్ టూ భద్రత కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయగా.. తనకు పోలీస్ సెక్యూరిటీ వద్దని రాధా తిరస్కరించిన సంగతి తెలిసిందే.