సంక్రాంతిని పురస్కరించుకొని ప్రయాణీకులు తమ స్వంత ఊళ్లకు బయలు దేరారు. అయితే ప్రభుత్వం 8వ తేది శనివారం నుంచే విద్యాసంస్థలకు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటించగా 9వ తేది ఆదివారం ఉదయం నుంచే విజయవాడ-హైద్రాబాద్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం అయింది. కాగా 13 గురువారం కూడా కిలో మీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి లోట్ ప్లాజా, విజయవాడకు సమీపంలోని పొట్టిపాడు టోల్ ప్లాజా వద్ద…
తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో ఇటీవల రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య హాట్‌టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే వీరి సూసైడ్ వెనుక టీఆర్ఎస్ ఎమ్మెల్యే కుమారుడు ఉన్నాడని ఆరోపణలు రావడం… అతడిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏపీలో తాజాగా మరో కుటుంబం ఆత్మహత్య కలకలం రేపుతోంది. విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వచ్చి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. అమ్మవారి దర్శనం అనంతరం విజయవాడ వన్‌టౌన్‌లోని కన్యకాపరమేశ్వరి సత్రంలో విషం తాగి…
కొత్త ఏడాది పసిడి ప్రేమికులకు గుడ్‌న్యూస్ చెబుతోంది.. మరోసారి కరోనా మహమ్మారి పంజా విసురుతుండడంతో.. ఆ ప్రభావం బంగారంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.. ప్రపంచవ్యాప్తంగా ధరలు పడిపోతున్నాయి.. అంతర్జాతీయ పరిస్థితులతో తోడు.. స్థానికంగా బంగారానికి డిమాండ్ తగ్గడంతో మరింత కిందకు దిగివచ్చాయి.. రెండు రోజుల క్రితమే రూ.300లకు పైగా తగ్గిన పసిడి ధర.. ఇవాళ రూ.380 వరకు తగ్గింది.. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.380 తగ్గి రూ.47,847కి పడిపోయింది..…
దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వైరస్‌ను గుర్తించడానికి సాంకేతిక విధానం అవసరం. ఇప్పటివరకు ఇలాంటి విధానం కలిగి ఉన్న ల్యాబ్‌లు దేశంలో పుణె, హైదరాబాద్ నగరాల్లోనే అందుబాటులో ఉన్నాయి. కొంచెం ఆలస్యంగా అయినా తాజాగా ఈ ల్యాబ్ ఏపీలో కూడా ఏర్పాటు కావడం విశేషం. విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కాలేజీ ప్రాంగణంలో జీనోమ్ సీక్వెన్సింగ్ కేంద్రం అందుబాటులోకి వచ్చింది. Read Also: రూపాయి పంపి రూ.99వేలు పోగొట్టుకున్నాడు హైదరాబాద్‌లోని సీసీఎంబీ ఆధ్వర్యంలో…
టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ హత్యకు రెక్కీ జరిగిందన్న వ్యవహారంపై తాము విచారణ చేపట్టామని విజయవాడ సీపీ క్రాంతి రాణా వెల్లడించారు. అయితే రాధా హత్యకు రెక్కీ జరిగినట్లు తమకు ఆధారాలేమీ దొరకలేదని సీపీ స్పష్టం చేశారు. రాధాకు గన్‌మెన్‌లను కేటాయించామని.. అయితే ఆయన తిరస్కరించారన్నారు. పోలీసులపై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు చేయడం సరికాదని క్రాంతి రాణా మండిపడ్డారు. Read Also: తత్కాల్ రూపంలో రైల్వేకు భారీ ఆదాయం రాధాపై రెక్కీకి సంబంధించి తాము రెండు…
విజయవాడ శివారులోని ఇబ్రహీంపట్నంలో ఆదివారం నాడు జుంబా డే నిర్వహించారు. తేజాస్ ఎలైట్ సంస్థ నిర్వహించిన ఈ కార్యక్రమంలో హీరో సంపూర్ణేష్ బాబు, వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువతను జుంబా డ్యాన్స్ పట్ల ప్రోత్సహించేందుకు హీరో సంపూర్ణేష్‌తో కలిసి వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ జుంబా డ్యాన్స్ చేశారు. అనంతరం నూతన సంవత్సర క్యాలెండర్‌ను వైసీపీ ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఇలాంటి ఫిట్ నెస్ ఈవెంట్లు మరిన్ని నిర్వహించాలని, జుంబా డ్యాన్స్…
తన హత్యకు రెక్కీ జరుగుతోందని ఇటీవల టీడీపీ నేత వంగవీటి రాధా చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. ఈ నేపథ్యంలో విజయవాడలోని వంగవీటి రాధా కార్యాలయం ముందు గత కొన్నిరోజులుగా పార్క్ చేసిన స్కూటర్ అనుమానాస్పదంగా మారడంతో రాధా అనుచరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు స్కూటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. పార్క్ చేసిన స్కూటర్ ఎవరిదన్న దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. Read Also: బీమా కంపెనీల ఆఫర్… పెళ్లి క్యాన్సిల్…
వంగవీటి రాధాపై రెక్కీ వార్తలు ఏపీ పాలిటిక్స్‌లో కలకలం రేపాయి.. ఆ విషయాన్ని రాధాయే స్వయంగా బయటపెట్టడం.. ఆ తర్వాత ప్రభుత్వం 2+2 సెక్యూరిటీ కల్పించడం.. ఆయన తిరస్కరించడం జరిగిపోయాయి.. మరోవైపు.. రెక్కీ నిర్వహించినవారి కోసం పోలీసుల వేట కొనసాగుతోంది.. కొందరిని అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే.. వంగవీటి రాధాపై రెక్కీ వ్యవహారంలో టీడీపీ సీనియర్ నేత చినరాజప్ప సీరియస్‌గా స్పందించారు.. రాధాను పార్టీలో చేర్చుకోవడం కాదు.. రెక్కీ నిర్వహించిన.. కుట్ర పన్నిన వైసీపీ నేతలపై…
వంగవీటి రాధా ఎపిసోడ్ ఇప్పుడు ఏపీలో చర్చగా మారింది.. తనను హత్య చేయడానికి రెక్కీ నిర్వహించారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయన.. తననేదో చేద్దామని కుట్ర చేశారని.. దేనికీ భయపడనని పేర్కొన్నారు.. తాను ప్రజల మధ్య ఉండే మనిషినని చెప్పిన రాధా.. అన్నింటికీ సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు.. దీనిపై పెద్ద చర్చే జరిగింది.. చివరకు ప్రభుత్వం వెంటనే రాధాకు 2+2 గన్మన్ల భద్రత కూడా కల్పించింది. రాధా భద్రతపై సీఎం వైఎస్ జగన్ సంబంధిత అధికారులకు కీలక…
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవడేకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఆంధ్రప్రదేశ్‌లో చాలా మంది నేతలు బెయిల్‌పై ఉన్నారని.. త్వరలో వారు మళ్లీ జైలుకు వెళ్లే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాగ్రహ సభలో పాల్గొని ప్రసంగించిన ఆయన… ఏపీలోని కొందరు నేతలు బెయిలుపై ఉన్నారు.. త్వరలో జైలుకెళ్లే అవకాశం లేకపోలేదు అంటూ కామెంట్లు చేసి ఒక్కసారిగా రాజకీయాల్లో హీట్ పెంచారు… ఇక, నిధులు కేంద్రానివి.. స్టిక్కర్లు రాష్ట్రానివి.. ఏపీలో…