ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఛలో విజయవాడ కార్యక్రమం విజయవంతమైంది. ఈ నేపథ్యంలో విజయవాడలోని బీఆర్‌టీఎస్ రోడ్డు మొత్తం కనుచూపు మేర ఉద్యోగులతో నిండిపోయింది. ఇసుకేస్తే రాలనంతగా ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలు చలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటీవల కాలంలో ఇంత పెద్ద స్థాయిలో ఏ ఉద్యమంలోనూ ఇంతమంది పాల్గొన్న దాఖలాలు లేవు. పోలీసులు జిల్లాల్లోనే కొందరు ఉద్యోగులను అడ్డుకున్నా.. మారు వేషాల్లో చలో విజయవాడకు ఉద్యోగులు తరలివచ్చారు. రైతులు, కూలీల వేషంలో ఉద్యోగులు విజయవాడ చేరుకున్నట్టు అనేక…
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో కీలక నిర్ణయం తీసుకుంది. కడప నుంచి విజయవాడ, చెన్నైకు విమాన సర్వీసులు నడిపేందుకు ఇండిగో సంస్థ ముందుకొచ్చింది. ఏపీ ఎయిర్‌పోర్ట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌తో ఈ మేరకు ఇండిగో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మార్గాల్లో విమానాలు నడిపిన ట్రూజెట్ సంస్థ తాము సర్వీసులు నడపలేమని ఒప్పందం రద్దు చేసుకోవడంతో ఇండిగోకు అధికారులు అవకాశం కల్పించారు. Read Also: ఏపీలో కార్యాలయం.. ఆర్బీఐ ఏం చెప్పిందంటే? తాజా ఒప్పందం దృష్ట్యా వయబిలిటీ గ్యాప్…
విజయవాడ నగరంలో ఇటీవల 9వ తరగతి చదువుతున్న బాలిక అపార్టుమెంట్ నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అయితే టీడీపీ నేత వేధింపులు తాళలేక తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానంటూ బాలిక సూసైడ్ నోట్ రాయడం సంచలనంగా మారింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. బాలిక ఉండే అపార్ట్‌మెంట్‌లోనే నివాసం ఉంటున్న టీడీపీ నేతను అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా అతడి ఇంటిని కూడా సీజ్ చేశారు. Read Also: మొక్కే…
విజయవాడ నగరంలో ప్రతి ఏడాది వైభవంగా నిర్వహించే గుణదల మేరీమాత ఉత్సవాలపై ఈ ఏడాది కరోనా ప్రభావం కనిపిస్తోంది. లక్షలాది మంది హాజరయ్యే గుణదల మేరీ మాత ఉత్సవాలను కరోనా కారణంగా ఈ ఏడాది రద్దు చేయాలని నిర్వాహకులు భావిస్తున్నారు. ప్రస్తుతం కరోనా థర్డ్ వేవ్ నడుస్తున్న సందర్భంగా లక్షలాది కేసులు వెలుగు చూస్తున్నాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఉత్సవాలను నిర్వహించడం కష్టసాధ్యమని, భక్తులు ఇబ్బందికి గురికాకూడదని నిర్వాహకులు యోచిస్తున్నారు. అందుకే ఉత్సవాలను రద్దు చేయాలని…
గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఈనెల 26న విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు వెల్లడించారు. ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలను ప్రభుత్వం నిర్వహించనుంది. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ ఈ వేడుకలకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 26న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా తెలిపారు. ★ బెంజిసర్కిల్ వైపు నుంచి ఎంజీ రోడ్డు…
అసలే ఆదివారం. సంక్రాంతికి ఊరికి వెళ్లివచ్చినవారు తమ తమ స్వలాలకు చేరుకున్నారు. విజయవాడ బస్టాండ్లో తీవ్రమయిన రద్దీ ఏర్పడింది. కొంతమంది మాత్రమే కోవిడ్ రూల్స్ పాటిస్తున్నారు. మాస్కులు లేకుండా తిరిగేవారికి ఆర్టీసీ వారు రూ.50 లు జరిమానాగా విధిస్తున్నారు. ఏపీలో ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ అమలుచేస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత కొనసాగుతూనే వుంది. ఏపీలో కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో.. జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తాజాగా శనివారం 43,763 శాంపిల్స్ ని పరీక్షించగా…
ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కేసులు పెరుగుతున్నాయి. ఈరోజు నుంచి ఏపీలో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. కరోనా థర్డ్ వేవ్ కారణంగా వైద్యులకు, వైద్యసిబ్బందికి జనవరి 10 నుంచి బూస్టర్ డోసులు అందిస్తున్నారు. సాధారణ ప్రజలతో పాటు వైద్యులు, వైద్యసిబ్బంది కరోనా బారిన పడుతున్నారు. తాజాగా విజయవాడలోని జీజీహెచ్లో కరోనా కలకలం రేగింది. జీజీహెచ్లో 50 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది. 20 మంది జూనియర్ వైద్యులు, సిబ్బంది కరోనా బారిన పడ్డారు.…
సంక్రాంతి సెలవులు ముగియడంతో ప్రజలు పల్లెల నుంచి పట్నం బాట పట్టారు. దీంతో స్వగ్రామాల నుంచి ప్రజలు హైదరాబాద్కు పయనం అయ్యారు. సోమవారం నుంచి ఆఫీసులు తెరుచుకోవడంతో ఉద్యోగులు సొంతూళ్ల నుంచి హైదరాబాద్ వస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ జాతీయరహదారిపై వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. Read Also: పశువుల పండగలో విషాదం.. పొట్టేలుకు బదులు మనిషి బలి సాధారణ రోజుల్లో విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వచ్చే వాహనాల రాకపోకలు సోమవారం రెట్టింపు స్థాయిలో ఉన్నాయని…
విజయవాడ పర్యటనలో మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్తో సమావేశం ముగించుకుని హైదరాబాద్ వెళ్లేందుకు గన్నవరం ఎయిర్పోర్టుకు వచ్చిన చిరంజీవి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తాను రాజకీయాలకు పూర్తిగా దూరమైనట్లు ప్రకటించారు. తనకు రాజ్యసభ టిక్కెట్ వస్తుందని జరుగుతున్న ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదన్నారు. రాజకీయాలకు దూరంగా ఉన్న తనకు ఇలాంటి ఆఫర్లు రావని… తాను కూడా ఇలాంటి ఆఫర్లను కోరుకోనని చిరంజీవి స్పష్టం చేశారు. Read Also: వైఎస్ఆర్ విగ్రహం మాయం..…