Ambati Rambabu Sensational Comments On Pawan Kalyan: ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు తాజాగా జనసేనాధినేత పవన్ కళ్యాణ్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ఇరిగేషన్‌పై సీఎం జగన్ నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడుతూ.. పవన్‌పై ధ్వజమెత్తారు. వారాహి అంటే అమ్మవారు అని.. అమ్మవారిని వాహనంగా చేసుకుని ఎక్కి, పవన్ కళ్యాణ్ పిచ్చిమాటలు మాట్లాడుతున్నాడని విరుచుకుపడ్డారు. ఇకపై పవన్ కళ్యాణ్ సినిమాలేవీ హిట్ కావని, ఇది అమ్మావారి శాపమని పేర్కొన్నారు. చంద్రబాబు దత్తపుత్రుడైన పవన్ కళ్యాణ్ నీచమైన ఆరోపణలు చేస్తున్నాడని మండిపడ్డారు. బట్టలు ఊడదీసి కొడతానని పవన్ అంటున్నాడని.. ప్రజాస్వామ్యంలో ఇది సాధ్యం అవుతుందా? అని ప్రశ్నించారు. ఇలాగే మాట్లాడితే.. చెప్పులతో పాటు నీ బట్టలు కూడా పోతాయని హెచ్చరించారు.
RGV: పవన్ కు కథ చెప్తే.. అలాంటి సినిమాల్లో నటించను అన్నాడు
ఇంతకీ పవన్ కళ్యాణ్ రాజకీయాలు చేస్తున్నాడా లేక రౌడీయిజం చేస్తున్నాడా? అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఆ మధ్య కూడా తన మీద రెక్కీ చేశారని అన్నాడని, అసలు పవన్ కళ్యాణ్‌ని చంపితే ఎవరికి లాభమని అంబటి రాంబాబు అడిగారు. ప్యాకేజీ స్టార్ ఇప్పుడు పచ్చిబూతుల స్టార్‌గా మారాడని ఆరోపించారు. ఈ నెల 23 తర్వాత మళ్లీ హైదరాబాద్ వెళిపోతాడన్నారు. హైదరాబాద్ వెళ్ళనని, ఇక్కడే ఉంటానని చెప్పే ధైర్యం పవన్‌కి ఉందా? అని ఛాలెంజ్ చేశారు. తనను ఓడించటానికి రూ.200 కోట్లు ఖర్చు పెట్టారని పవన్ చెప్పాడని, నువ్వు పోటీ చేసిన రెండు చోట్ల కూడా ఓడిపోయాయని చురకలంటించారు. తనకు ప్రాణహాని ఉందని పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలను సీరియస్‌గా తీసుకోవాలన్నారు. నిజంగా ప్రాణహాని ఉంటే, ఆధారాలు చూపించమని అడిగారు. అలాగే పోలీసులకు ఫిర్యాదు చేయమని సూచించారు. ఊరికే ఆరోపణలు చేసి, గందరగోళం చేయాలని ప్రయత్నిస్తే.. పవన్ కళ్యాణ్‌పై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
Ambati Rambabu: చంద్రబాబుకి జగన్ చేతిలో మరోసారి కౌరవ వధ తప్పదు
రష్యాలో పవన్ కళ్యాణ్‌పై ఫైల్ ఓపెన్ అయ్యిందని.. మోడీ కాళ్లు, అమిత్ షా కాళ్లు పట్టుకున్నా లాభం లేదని అంబటి రాంబాబు కుండబద్దలు కొట్టారు. పవన్ కళ్యాణ్ ఒక చెప్పు టీడీపీ ఆఫీసులో, ఒక చెప్పు బీజీపీ ఆఫీసులో ఉందని ఎద్దేవా చేశారు. జీవీఎల్ చట్టాల గురించి తెలుసుకుని మాట్లాడితే మంచిదని హితవు పలికారు. ఇష్టం వచ్చినట్లు దరువు వేసే కార్యక్రమాలను మానుకోవాలని సూచించారు. ఆరోపణలు చేయటంలో పవన్ కళ్యాణ్ టీడీపీ వాళ్లతో పోటీ పడుతున్నారని దుయ్యబట్టారు. పవన్ కళ్యాణ్, బీజేపీ కలిసి ఉన్నారో.. లేక పవన్ కళ్యాణ్, టీడీపీ కలిసి ఉన్నారో తెలియదన్నారు. ఎంతమంది కట్టకట్టుకుని వచ్చినా.. జగన్ గెలుపును ఎవరూ ఆపలేరని తేల్చి చెప్పారు. 50 శాతానికి పైగా ఓట్లు తమకే రానున్నాయని జోస్యం చెప్పారు.