Perni Nani: పవన్‌ని సినిమాల్లో తప్ప బయట ఎవరినీ కొట్టలేడు.. పేర్ని నాని కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Perni Nani Counter Attack On Pawan Kalyan: తనకు ప్రాణహాని ఉందంటూ జనసేనాధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. ప్రాణహాని అంటూ పవన్ సొల్లు కబుర్లు చెబుతున్నాడంటూ ఆయన ధ్వజమెత్తారు. తనకు నిజంగా ప్రాణహాని ఉంటే.. ఏనాడైనా పోలీసులకు ఫిర్యాదు చేశాడా? అని ప్రశ్నించారు. ఆయనకు చంద్రబాబు వల్లే ప్రాణహాని ఉందని ఆరోపించారు. బట్టలూడదీసి కొడతానని పవన్ అంటున్నాడని.. ఆయన సినిమాల్లో తప్ప, బయట ఏ ఒక్కరినీ కొట్టలేడని దుయ్యబట్టారు. తన దగ్గర పనిచేసే సిబ్బందిని మినహాయిస్తే, పవన్ ఎవడ్ని కొట్టలేడంటూ ఎద్దేవా చేశారు. అరాచకంగా పాలించిన చంద్రబాబుని పవన్ ఏనాడైనా కొట్టాడా అని నిలదీశారు. లోకేష్ అవినీతిపరుడని పవన్ గతంలో ఆరోపించారని, మరి అప్పుడు లోకేష్‌ని గుడ్డలిప్పి పవన్ కొట్టగలిగాడా? అని అడిగారు. పవన్‌ది రౌడీ మనస్తత్వమని, అందుకే అలా మాట్లాడుతున్నాడని అన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబుతో పవన్ కలిసిపోవడం ఖాయమని.. సీఎం జగన్‌ను ఎదుర్కోవడంపవన్ వల్ల కాదు అని పేర్ని నాని పేర్కొన్నారు.
Miss Universe Titles: అత్యధిక మిస్ యూనివర్స్ టైటిల్స్ నెగ్గిన టాప్-10 దేశాలు
Also Read
ఇదే సమయంలో డిప్యూటీ సీఎం మంత్రి కొట్టు సత్యనారాయణ కూడా పవన్ కళ్యాణ్‌పై విరుచుకుపడ్డారు. తనకు ఏదైనా జరిగితే.. ఆ నెపాన్ని వైసీపీ మీదకు నెట్టి, రాజకీయంగా లబ్ధి పొందేందుకు పవన్ ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. పవన్ అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని, వారాహి యాత్ర పేరుతో అవాకులు చెవాకులు పేలుతున్నారని అన్నారు. తనకు ప్రాణహాని ఉందని పవన్ ఎందుకన్నారో తెలియదని.. అయితే అది చంద్రబాబు నుంచే ఉందని గ్రహించాలని సూచించారు. చంద్రబాబుపై పవన్ ఓ కంట కనిపెడుతూ జాగ్రత్తగా ఉండాలన్నారు. పవన్ పాలిచ్చే ఆవును వదిలేసి, తన్నే దున్నపోతు లాంటి చంద్రబాబును విశ్వసిస్తున్నారని అన్నారు. స్థిరత్వం లేని మాటలతో ప్రజల్లో చులకన కావొద్దని హితవు పలికారు. గతంలో తనకు ముఖ్యమంత్రి అయ్యే సీన్ లేదని చెప్పిన పవన్.. ఇప్పుడు ఆ పదవి చేపట్టడి కోసం సిద్ధంగా ఉన్నానని చెప్పడం విడ్డూరమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో పవన్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించగలరా అని చంద్రబాబుకు సవాల్ విసిరారు. గుంట నక్క లాంటి చంద్రబాబుని, ఆయనతో ఉన్నందుకు పవన్‌ని ఓడించాలని ప్రజలు అనుకుంటున్నారన్నారు.
Health Tips: ఈ సంకేతాలు మీరు ఎక్కువగా ఉప్పు తింటున్నట్లు చూపుతాయి, వెంటనే తగ్గించుకోవాలి.
తాజావార్తలు
-
Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
-
Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
-
Bypoll Results Today: నేడే ఉప ఎన్నికల ఫలితాలు.. విజయ్ TVK పార్టీ భవితవ్యంపై ఆసక్తి.. బెంగాల్లో బీజేపీకి పరీక్ష
-
Tilak Varma: ఆ పొజిషన్లో బ్యాటింగ్ చేయడమే ఇష్టం.. కానీ తప్పడం లేదు!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!