Botsa Satyanarayana: పవన్ వ్యాఖ్యలకు మంత్రి బొత్స స్ట్రాంగ్ కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Botsa Satyanarayana Strong Counter To Pawan Kalyan: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అందరూ రౌడీలు, గూండాలే ఉన్నారని జనసేనాధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జనసేన పార్టీనే దొంగల, రౌడీల పార్టీ అంటూ తూర్పారపట్టారు. వైసీపీ పార్టీలో ఉన్న తాను కూడా రౌడీనా? గూండానా? అంటూ మంత్రి బొత్స ప్రశ్నించారు. తన చరిత్రలో ఒక్క కేసు కూడా లేదని, ఇంకా చెప్పుకుంటే పవన్ కళ్యాణ్‌పై ఏదో ఒక కేసు నమోదై ఉండొచ్చని అన్నారు. అసలు జనసేన పార్టీలో చెప్పుకోదగ్గ ఒక్క నాయకుడైనా ఉన్నాడా? అలాంటప్పుడు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఎందుకని నిలదీశారు. పవన్ కళ్యాణ్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే.. ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఆయనకు ఒక విధానం, ఆలోచన లేదని విమర్శించారు.
Swamyji Sampoornananda: విశాఖలో బయటపడ్డ కీచక స్వామీజీ లీలలు.. బాలికపై లైంగిక దాడి
Also Read
- AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
- Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
- Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై కూడా మంత్రి బొత్స విరుచుకుపడ్డారు. ఎవరికో పుట్టిన బిడ్డను తనకు పుట్టిన బిడ్డగా జగన్ చెప్పుకుంటారని చంద్రబాబు వ్యాఖ్యానించారని.. అసలు చంద్రబాబుకి ఇంగితజ్ఞానం ఉందా? ఆ వయసుకు ఆయన మాట్లాడాల్సిన మాటలేనా అవి? అని నిలదీశారు. అలాంటి మాటలు మాట్లాడటం, మళ్లీ ఎవరైనా ఏమైనా అంటే ఏడ్వడం అంటూ మంత్రి బొత్స ఎద్దేవా చేశారు. టిడ్కో ఇల్లు తానే కట్టుకున్నానని చంద్రబాబు చెప్పుకుంటున్నారని, మరీ సీఎంగా ఉన్నప్పుడు ఎందుకని ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని, ఇందుకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన 40 ఏళ్ల ఇండస్ట్రీ ఏమయ్యింది? అని అడిగారు. వైసీపీ మాత్రమే బీసీల పార్టీ అని, తమ ప్రభుత్వం మహిళా పక్షపాతి ప్రభుత్వంమని అన్నారు. 2024 ఎన్నకల్లో తాము ఒంటరిగానే పోటీకి దిగుతామని మంత్రి పేర్కొన్నారు.
Ambati Rambabu: పవన్ కళ్యాణ్‌పై అంబటి సంచలన ఆరోపణలు.. రష్యాలో ఫైల్ ఓపెన్
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!