జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి వాహనంపై యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో నేడు డా.బీ.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం జనసేన పార్టీ సభ సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు, మీటింగ్ కు వచ్చే వారికి పార్కింగ్ స్థలాలు ఏర్పాట్లను అమలాపురం డీఎస్పీ సమీక్షించారు. ఈ సందర్భంగా అమలాపురంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు వెల్లడించారు. నేటి సాయంత్రం అమలాపురంలో వారాహియాత్ర, బహిరంగ సభ సందర్భంగా మధ్యాహ్నం 3:00 గం, ల నుండి రాత్రి 9:00 గం, ల వరకు అనుమతించబడవని ఆయన తెలిపారు.
ఆ సమయములో:
1) ముమ్మిడివరం నుండి అమలాపురం మీదుగా రావులపాలెం వెళ్ళు వాహనాలు: కొండలమ్మ చింత- క్రాప – K. జగన్నాధపురం – తొత్తరమూడి – ముక్తేశ్వరం- మడుపల్లి మీదుగా రావులపాలెం.
2) ముమ్మిడివరం, ఉప్పలగుప్తం నుండి రావులపాలెం వెళ్ళు వాహనాలు: అనాతవరం – మాగం – సిరిపల్లి – ముక్తేశ్వరం – అయినవిల్లి – మడుపల్లి మీదుగా రావులపాలెం.
3) కాకినాడ నుండి అమలాపురం మీదుగా రాజోలు వెళ్ళు వాహనాలు: భట్నవిల్లి బైపాస్ మీదుగా చిందాడగరువు – రోళ్లపాలెం – పేరూరు Y జంక్షన్ –నగరం రాజోలు.
4) రాజోలు నుండి కాకినాడ వెళ్ళు వాహనాలు: పేరూరు Y-జంక్షన్ బైపాస్ మీదుగా – రోళ్లపాళ్లెం – చిందాడ గరువు – భట్నవిల్లి మీదుగా కాకినాడ.
5) రాజోలు, నగరం నుండి అమలాపురం మీదుగా రావులపాలెం వెళ్ళు వాహనాలు: బోడసకుర్రు బ్రిడ్జి – తోట్లపాలెం – వాకలగరువు – నందంపూడి – అంబాజీపేట మీదుగా రావులపాలెం.
6) అమలాపురం నుండి అంబాజీపేట రావులపాలెం వెళ్ళు టూవీలర్స్, ఆటోస్: ఎత్తురోడ్ – BVC కాలేజ్ – ఇందుపల్లి బ్రడ్జి మీదుగా వెళ్ళాలి.
7) అమలాపురం నుండి ముక్కామల రావులపాలెం వెళ్ళు టూ వీలర్స్, ఆటోలు: నల్లవంతెన – జనుపల్లి – నేదునూరు – ముక్కామల మీదుగా వెళ్ళాలి.
8) నల్లవంతెన -నడిపూడి కాల్వగట్టు మీదుగా నడిపూడి లాకులు – ముక్కామల వెళ్ళాలి.
9) ఎర్రవంతెన మీదుగా పేరూరు Y-జంక్షన్ వెళ్ళు బైక్ లు & ఆటొ లు: ఎర్రవంతెన – విత్తనాల కాల్వగట్టు – వడ్డీగూడెం – సాయిబాబా టెంపుల్ – గోఖలే సెంటర్ మీదుగా వెళ్ళాలి.
10) A.వేమవరప్పాడు నుండి ముమ్మిడివరం, రాజోలు వెళ్ళవలిసిన టూ వీలర్స్ మరియు 4 వీలర్స్: A.వేమవరప్పాడు- భట్నవిల్లి ఐస్ ఫ్యాక్టరీ – భట్నవిల్లి బైపాస్ రోళ్ళపాలెం, పేరూరు Y-జంక్షన్ -మీదుగా వెళ్ళాలి.
మీటింగ్ కు వచ్చే వాహనాల పార్కింగ్ స్థలములు :
1) రాజోలు,అల్లవరం మరియు పేరూరు వై జంక్షన్ నుంచి వచ్చే 2/3/4 వీలర్స్– అమలాపురం హై స్కూల్ సెంటర్ లో ఉన్న బాయ్స్/ గర్ల్స్ హై స్కూల్ గ్రౌండ్.
2) ముమ్మడివరం నుండి రెడ్ బ్రిడ్జి మీదగా వచ్చే 2/3/4 వీలర్స్– వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎదురుగా ఉన్న కర్రి సత్యనారాయణ రైస్ మిల్ ఓపెన్ ప్లేస్, గాంధీనగర్ ఆర్చి లోపల మండేలా బాబి ఇంటి పక్కన ఖాళీ స్థల౦.
3) అయినవిల్లి వైపు నుంచి వచ్చే 2 వీలర్స్– జనుపల్లి మన్న ఆర్చ్ వద్ద అంబేద్కర్ గారి విగ్రహం వెనకాల ఓపెన్ ప్లేస్, ౩/4 వీలర్స్- జిఎంసి బాలయోగి స్టేడియం.
4) నల్ల వంతెన వైపు వచ్చే 2/3/4 వీలర్స్ — మిరియం డిగ్రీ కాలేజీ గ్రౌండ్, నల్ల వంతెన.
5) అంబాజీపేట వైపు ఈదరపల్లి బ్రిడ్జి మీదుగా వచ్చే 2/3/4 వీలర్స్ — లారీ యూనియన్ ఆఫీసు ఖాళీ స్థల౦.
6) బస్టాండ్ వైపు నుంచి, నారాయణపేట మరియు బ్యాంక్ స్ట్రీట్ నుంచి వచ్చే 2/3/4 వీలర్స్– సి.వి. రామన్ స్కూల్ గ్రౌండ్ & విద్యానిధి స్కూల్ గ్రౌండ్.