Dwarampudi Chandrasekhar Reddy Satirical Comments On Pawan Kalyan: కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తాజాగా జనసేనాధినేత పవన్ కళ్యాణ్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇప్పటివరకు తన మీద పోటీ చేస్తానని పవన్ ప్రకటిస్తాడని ఎదురుచూశానని.. కానీ తోక ముడుచుకొని వెళ్లిపోతుడున్నాడని ఎద్దేవా చేశారు. తన మీద పోటీ చేస్తానని పవన్ నిర్ణయం తీసుకోకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ నిర్ణయం తీసుకోలేదంటే.. పవన్ తన వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకున్నట్టే కదా అని అన్నారు. ఒక స్ట్రాటజీతో చంద్రబాబు ఇచ్చిన ప్లాన్ ప్రకారం పవన్ తన వారాహి యాత్ర చేస్తున్నాడని.. చంద్రబాబు ఆడిస్తే ఇతను ఆడుతున్నాడని విమర్శించారు. కాపులు, రెడ్లు కలిసే ఉన్నారన్నారు. చంద్రబాబు చెప్పు చేతల కింద పవన్ పార్టీ ఉందని, కేవలం తనని తిట్టడానికే పవన్ ఇక్కడికి వచ్చాడని అన్నారు. తాను కాకినాడ నుంచి వెళ్లేలోపు పవన్ తన మీద పోటీ చేస్తానని చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే.. తనపై చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్నట్లు అనుకుంటానన్నారు. ముద్రగడ ప్రకటన చేయడం చాలా సంతోషమని, తమ కుటుంబం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పారు. ముద్రగడ సలహా తీసుకుని.. పవన్ తన మీద పోటీ చేయాలని సూచించారు.
Yogi Adityanath: పాకిస్తాన్ వెంట ఎవరు ఉండరు.. పీఓకే భారత్‌లో భాగం కావాలనుకుంటోంది..
అంతకుముందు కూడా.. పవన్‌కళ్యాణ్‌కు దమ్ముంటే కాకినాడలో తనపై పోటీ చేసి ఓడించాలని ద్వారంపూడి ఛాలెంజ్ చేశారు. ఒకవేళ తాను ఓడిపోతే.. పవన్ చేసిన ఆరోపణలన్నీ నిజమని ఒప్పుకుంటానన్నారు. పవన్‌కు దమ్ము, ధైర్యం ఉంటే.. తన సవాలు స్వీకరించాలన్నారు. ఎమ్మెల్యే లేదా ముఖ‌్యమంత్రి కావాలనే పవన్ కోరిక కేవలం సినిమాల్లో తీరుతుందే తప్ప బయట తీరదని.. సీఎం అవ్వాలని అంత కోరికగా ఉంటే ఒక సినిమా తీసుకోవాలని ఎద్దేవా చేశారు. పవన్ కేవలం చంద్రబాబును ఉద్దరించడానికి పార్టీ పెట్టాడని ఆరోపించారు. తాను రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, కానీ రాజకీయంగా పవన్ కళ్యాణ్ జీరో అని విమర్శించారు. పవన్ రోజుకో మాట చెప్తుంటారని.. మార్చి 14న తనకు సీఎం అయ్యే బలం లేదన్న పవన్, జూన్ 14న కత్తిపూడిలో తనని సీఎం చేయాలని వేడుకున్నారని గుర్తు చేశారు. మధ్యలో ప్యాకేజీ కోసం చంద్రబాబు దగ్గరకు కూడా పవన్ వెళ్లాడని పేర్కొన్నారు.
PM Modi: రష్యాపై భారత వైఖరి ఏమిటో ప్రపంచానికి తెలుసు.. ప్రధాని కీలక వ్యాఖ్యలు..