Pawan Kalyan Requests People To Vote Him In Next AP Elections: తాను చాలా కమిట్మెంట్‌తో జనసేన పార్టీని ప్రారంభించానని.. అధికారమే అంతిమ లక్ష్యం అనుకుంటే, తనకు ఇంత కష్టపడాల్సిన అవసరం లేదని జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తన వారాహి యాత్రలో భాగంగా కాకినాడలో పవన్ మాట్లాడుతూ.. తనకున్న కెపాసిటీకి ఏదో ఒక పదవి పొందవచ్చని, ఇన్ని మాటలు పడాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రస్తుత ఉన్న సీఎంలా తాను అద్భుతాలు చేస్తానని చెప్పడం లేదని.. బటన్ నొక్కితే డబ్బులు పడతాయని చెప్పనని అన్నారు. ఉప కులాలు ఐక్యత చాలా అవసరమన్నారు. మీరు సరైన వ్యక్తిని నమ్మడం లేదని.. మీ విశ్వాసం, నమ్మకం సరైన వ్యక్తులపై పెట్టడం లేదని చెప్పారు. తాను రెండు చేతులెత్తి నమస్కరిస్తున్నానని, వచ్చే ఎన్నికల్లో తమని గెలిపించాలని పవన్ ప్రజల్ని అభ్యర్థించారు.
Botsa Satyanarayana: పవన్ వ్యాఖ్యలకు మంత్రి బొత్స స్ట్రాంగ్ కౌంటర్
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర ఇసుకకి సంబంధించిన మూడు కంపెనీలు ఉన్నాయని.. 10 వేల కోట్లు వెళ్లిపోతున్నాయని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. మీరు నాకు ఎంపీలు ఇవ్వండి, నేను పని చేయిస్తానని చెప్పారు. పవన్ కళ్యాణ్‌కి ఇంత ఓటు షేర్ ఉంది కాబట్టే పీఎం తనని పిలిపిస్తారన్నారు. అభివృద్ధి రోడ్డు మీద పడేయకూడదన్నారు. 40 గజాల్లో ఇల్లు ఏమీ వస్తుందని ప్రశ్నించారు. ఏపీ ఆర్ధిక వ్యవస్థకి మీ కష్టం, మీ రక్తం, మీ శ్రమే కారణమన్నారు. మీ ఆదాయం సీఎం ముగ్గురుకి అంటగట్టేశాడని ఆరోపణలు చేశారు. మీరు నా కోసం నిలబడితే, మీ కోసం పోరాటం చేయగలనని పేర్కొన్నారు. తనకు ఎవరితోనూ కుమ్మక్కు అవ్వాల్సిన అవసరం లేదన్నారు. డబ్బు సంపాదించే కొద్దీ పోరాట పటిమ తగ్గిపోతుందని చెప్పుకొచ్చారు.
Serial Killer : జైలునుంచి వచ్చిన సీరియల్ కిల్లర్.. వణికిపోతున్న గోవా మహిళలు