V. Hanumantha Rao: కాంగ్రెస్ ఒత్తిడి వల్లే కేంద్ర ప్రభుత్వం కులగణన చేపట్టాలని నిర్ణయం తీసుకుందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాడానికి హస్తం పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే, ఇవాళ ఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో ఓబీసీ ప్రతినిధులతో కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశం ముగిసిన తర్వాత కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హన్మంతరావు మాట్లాడుతూ.. త్వరలోనే రాహుల్ గాంధీకి ధన్యవాద సభ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. భారత జోడో యాత్రలో రాహుల్ గాంధీ కీలక నిర్ణయం ప్రకటించాడు.. అధికారంలోకి వస్తే కులగణన చేస్తామని అప్పుడే వెల్లడించారు.. అందులో భాగంగానే.. దేశంలోనే మొట్ట మొదట తెలంగాణలో కులగణన చేశామని వి. హన్మంతరావు తెలిపారు.
Read Also: Mumbai Rainfall: ముంబైపై జలఖడ్గం.. 107 ఏళ్ల నాటి రికార్డ్ బద్ధలు
ఇక, రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు జరుగుతాయని మాజీ ఎంపీ వి. హన్మంతరావు పేర్కొన్నారు. ఆలిండియా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో.. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి బీసీ నేతలను పిలిచి సమావేశం నిర్వహించారు.. అయితే, మోడీ పదేళ్లు ప్రధానిగా ఉన్నా.. బీసీలకు మాత్రం మేలు చేయడం లేదు అని ఆరోపించారు. ఓబీసీ ఎంపీల కన్వీనర్ గా మూడు సార్లు ప్రధానిని కలిశాను.. కులగణన చెయ్యాలని కోరాను.. కానీ, ఇప్పటి వరకు చేయలేదు.. త్వరలోనే కులగణన చేస్తామని చెప్పారని వీహెచ్ వెల్లడించారు.