ప్రస్తుత రోజుల్లో సమాజంలో జరుగుతున్న దారుణాల పట్ల కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు ఆవేదన వ్యక్తం చేశారు. హనుమంత రావు మాట్లాడుతూ.. సమాజంలో భర్తలను భార్య.. తల్లినీ.. బిడ్డ చంపడం చూస్తుంటే బాధ ఐతుందన్నారు. ఒకప్పుడు ఫ్యాక్షన్ మర్డర్స్ జరిగేవి. ఇప్పుడు లవ్ మర్డర్స్ జరుగుతున్నాయని తెలిపారు. అబ్బాయి, కానీ అమ్మాయి కానీ మీకు నచ్చకపోతే పెళ్లి చేసుకోకండి.. మీకు నచ్చిన వారినే చేసుకోండని సూచించారు. సమాజం ఎక్కడికి పోతుంది..? యమధర్మ రాజుతో కూడా భర్త కోసం కొట్లాడిన భార్యలను చూశానని అన్నారు. కానీ ఇప్పుడు జరుగుతున్న హత్యలు చూస్తుంటే మానవ సంబంధాలకు ఏమైతుంది అని అనిపిస్తుందన్నారు. పాత రోజులే బాగున్నై అనిపిస్తుంది.
Also Read:YS Jagan: రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో.. ఒక్కో కుటుంబం ఎంతెంత నష్టపోయిందో ప్రజల ముందుకు..!
సోషల్ మీడియాలో ఇలాంటి ఘటనలు ఎక్కువ ప్రచారం చేస్తున్నారు. దీన్ని హీరోయిజం అనుకుంటున్నారని వాపోయారు. సాఫ్ట్‌వేర్లు కో లివింగ్ పేరిట అడ్డదార్లు తొక్కుతున్నారు. మంత్రి శ్రీధర్ బాబు దీనిపై ఆలోచన చేయాలి.. ఇలాంటి వాటిని అరికట్టాలని కోరారు. అమ్మాయి.. అబ్బాయి ఒకే రూమ్ లో ఉండే విధానం బాగాలేదు. ప్రభుత్వం ఆలోచన చేయాలి.. లేదంటే ఇలాంటి హత్యలు జరుగుతూనే ఉంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్.. షీ టీం తో చర్చలు జరపాలని కోరారు. సమాజంలో ఉన్న విద్యావేత్తలు.. డాక్టర్ లు.. ఆలోచన చేసి దారుణాలను అరికట్టడానికి తమవంతు కృషి చేయాలని కోరారు.
Also Read:YS Jagan: ఏడాది గడిచింది.. హనీమూన్ పీరియడ్ ముగిసింది.. ఇక యుద్ధమే..!
గద్వాలలో ఐశ్వర్య అనే యువతి తేజేశ్వర్ ను పెళ్లి చేసుకుని ప్రియుడి సాయంతో భర్తను కాటికి పంపిన విషయం తెలిసిందే. పెళ్లైన నెల రోజులకే దారుణానికి ఒడికట్టింది. అంతకు ముందు ఇండోర్ కు చెందిన రాజా రఘువంశీని ఇష్టం లేని పెళ్లి చేసుకున్న సోనమ్ హనీమూన్ కోసమని మేఘాలయకు తీసుకెళ్లి ప్రియుడితో కలిసి కిరాయి హంతుకులతో చంపేసింది. ఇక నిన్న జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో పదో తరగతి బాలిక తన ప్రియుడితో ప్రేమ పెళ్లికి ఒప్పుకోవడం లేదని తల్లిపై కక్షగట్టి ప్రియుడి సాయంతో దారుణంగా హతమార్చింది. రోజుల వ్యవధిలోనే వరుస ఘోరాలు జరుగుతుండడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.