Off The Record: కాంగ్రెస్ పార్టీ కురువృద్ధుడు వి.హనుమంతరావు గుస్సా అవుతున్నారా? ఏంటిది? ఎందుకిలా అంటూ ఫైర్ మీదున్నారా? నాలాంటి వాడితో మీరు వ్యవహరించాల్సిన తీరు ఇదేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారా? అసలు ఏ విషయంలో వీహెచ్‌కు కోపం వచ్చింది? ఎందుకు ఆయన ఇప్పుడు చర్చనీయాంశం అయ్యారు?
Read Also: Off The Record: ఇక్కడ పోస్టింగ్స్ అంటేనే వణికిపోతున్న అధికారులు
వి.హన్మంతరావు అలియాస్ వీహెచ్. కాంగ్రెస్‌లోనే కాదు, తెలంగాణలోనే కాదు, ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో సైతం ఆయనంటే తెలియని వారు ఉండరు. ఇంకా చెప్పాలంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ కురువృద్ధుడాయన. గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. తొలి నుంచి కాంగ్రెస్‌కు లాయల్‌గా ఉంటూ… అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారన్న పేరుంది. గాంధీ కుటుంబాన్నిగాని, కాంగ్రెస్‌ను గాని… విమర్శించే వాళ్ళ మీదికి దండెత్తడంలో వీహెచ్ ముందుంటారని కూడా చెప్పుకుంటారు. అందుకే పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఆయనకు ప్రాధాన్యం ఇస్తూ… ఏదో ఒక అవకాశం ఇస్తారు. అలాంటి హన్మంతరావుకు ప్రస్తుతం పార్టీలోఆదరణ తగ్గినట్టు కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. అసలాయన్ని పట్టించుకునే నాధుడే లేడట. గతంలో ఎంపీ టికెట్ ఇస్తారని ప్రచారం జరిగినా ఇవ్వలేదు. రాజ్యసభ సీటు అడిగినా లాభం లేకపోయింది.
Read Also: Off The Record: అరెస్ట్ అనేది జరిగితే.. చేసేది సిట్టా? ఈడీనా?
ఇక, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవి ఖచ్చితంగా వస్తుందని గట్టి నమ్మకంతో ఉన్న వీహెచ్‌కు ఆ విషయంలో కూడా నిరాశే ఎదురైంది. దీంతో ఆయన కాస్త గుస్సాగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు పార్టీ నాయకులు. క్రమశిక్షణ కలిగిన నేతగా, పార్టీకి లాయల్‌గా ఉండే నాకు ఎలాంటి అవకాశం ఇవ్వకపోవడమేంటంటూ… ఆయనలో అసహనం పెరిగిపోతున్నట్టు తెలుస్తోంది. పదేళ్ళ తర్వాత పార్టీ అధికారంలోకి వస్తే… అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికీ పార్టీ అంటే ప్రాణం పెట్టే నాకు పదవి ఇవ్వరా? కాంగ్రెస్ పార్టీకి నాకంటే విశ్వాసంగా ఉండేవాళ్ళు ఎవరో చూపమంటూ హై కమాండ్‌లో తనకు పరిచం ఉన్న పెద్దల్ని ప్రశ్నిస్తున్నారట ఆయన. ఎవరెవరికో పదవులు ఇస్తూ నాకు ఇవ్వకుంటే అసలు లాయల్టీ అన్న పదానికి అర్ధం ఏంటన్నది ఆయన క్వశ్చన్. ఆయనకు ఆయనే బరస్ట్ అవుతున్నందున కాంగ్రెస్ పెద్దలు ఇప్పటికైనా విహెచ్‌ని గుర్తిస్తారా? లేక…. ఇన్నేళ్ళు ఇచ్చిన గుర్తింపు చాలు. ఇంకేం ఇస్తామని అంటారా అన్నది చూడాలంటున్నారు పొలిటికల్ పండిట్స్. కాంగ్రెస్ పార్టీలోని గ్రూపులు ఆయనకు అడ్డుపడుతున్నాయా? లేక వయసు రీత్యా ఇక చాల్లే అని అనుకుంటున్నారా అన్న డౌట్స్ కూడా వస్తున్నాయట కొందరికి.