CM Yogi Adityanath: కాల్చిచంపబడిన గ్యాంగ్ స్టర్-రాజకీయ నాయకుడు అతీక్ అహ్మద్ నుంచి జప్తు చేసిన భూమిని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేదలకు పంచారు. ఈ భూమిలో పేదల కోసం నిర్మించిన 76 ఫ్లాట్ల తాళాలను లబ్ధిదారులకు అందించారు.
Chandra Shekhar Aazad : భీమ్ ఆర్మీ చీఫ్, ఆజాద్ సమాజ్ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆజాద్‌పై దుండుగులు కాల్పులు జరిపారు. ఈ ఘటన బుధవారం ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లోని దేవ్బంద్లో జరిగింది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాలో ఓ ప్రియుడు మాత్రం తన ప్రేయసికి వెరైటీగా సారీ చెప్పాడు. అతను క్షమాపణలు చెప్పిన విధానం ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. సుష్ యొక్క ఆలోచన సంజూ హృదయాన్ని గెలుచుకుందో లేదో మాకు తెలియదు కానీ మా మనస్సును మాత్రం దోచుకుంది అని నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.
Uttar Pradesh: 17 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. తీవ్రగాయాలపాలైన బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. దీంతో హిందూ సంస్థలు, విశ్వహిందూ పరిషత్ నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేయడంతో ఉత్తరప్రదేశ్ యోగి సర్కార్ బుల్డోజర్ యాక్షన్ తీసుకుంది. మంగళవారం ఫతేపూర్ లోని నిందితుడి ఇంటిని అధికారులు బుల్డోజర్ తో కూల్చేశారు.
పెళ్లింట వధువు వరుడిని దేశ ప్రధాని ఎవరో చెప్పమని ప్రశ్నించింది. దానికి వరుడు సమాధానం చెప్పలేకపోవడంతో వధువు తన పెళ్లిని రద్దు చేసుకుని వరుడి తమ్ముడిని పెళ్లాడింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్ జిల్లాలో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది.
Yogi Adityanath: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరోసారి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370 ఎత్తేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్ లో భారత చట్టాలే అమలవుతున్నాయని ఆయన అన్నారు.
బీహార్‌లో టోల్‌ప్లాజా గార్డుగా పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్ కి చెందిన ఓ వ్యక్తిని 50 రూపాయలు దొంగిలించాడన్న అనుమానంతో కొందరు వ్యక్తులు కొట్టి చంపారు. స్థానికంగా ఈ విషయం సంచలనం సృష్టించింది. ఈ ఘటన భోజ్‌పూర్ జిల్లాలోని అర్రా-పాట్నా రహదారిపై కుల్హదియా టోల్‌ప్లాజా వద్ద ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది.
ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. యూపీ రాష్ట్రం మీరట్‌లోని షాజన్‌పూర్‌లో ఓ మామిడి తోటలో ఓ పదేళ్లబాలుడు పెంపుడు కుక్కతో ఆడుకున్నట్లు చిరుత పిల్లతో ఆటలాడుతున్నాడు. ఆ చిరుత కూన మెడలో తాడు కట్టి ఉంది.. ఆ కూన మామిడిచెట్టు కింద ఉండగా బాలుడు దాన్ని పట్టుకోడానికి ప్రయత్నం చేస్తున్నాడు.
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ లో దొంగతనం చేశాడనే అనుమానంతో స్థానికులు ముస్లిం వ్యక్తిని చెట్టుకట్టేసి కొట్టారు. అంతటితో ఆగకుండా గుండు కొట్టించి, జై శ్రీరామ్ నినాదాలు చేయాలని బలవంతం చేశారు. ఈ ఘటన యూపీలోని బులంద్ షహర్ జిల్లాలో జరిగింది.