Uttar Pradesh: మహిళలపై, చిన్నారులపై అత్యాచారాలు, అనంతరం హత్యలు చేయడం ఆగడం లేదు. ఎన్ని కఠిన చట్టాలు చేస్తున్నా ఆడ బిడ్డల తల్లిదండ్రుల కంట కన్నీరు రాకుండా చేయలేకపోతున్నాయి. దేశంలో ప్రతిరోజూ ఏదో మూల ఇలాంటి ఘటనలు జరగుతూనే ఉంటున్నాయి. తాజాగా ఓ నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి ఆపై హత్య చేశారు కొందరు దుండగులు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్ లో జరిగింది.
Also Read: Air Traffic: విమానాల్లో తెగ తిరిగేస్తున్న జనం.. ఆగస్టులో 23శాతం దేశీయ విమాన ట్రాఫిక్
నాలుగేళ్ల బాలిక ఫరూఖాబాద్ లోని తన ఇంటి ముందు ఆరుబయట ఆడుకుంటుంది. అయితే కొద్ది సేపటి తరువాత ఆమె కనిపించకుండా పోయింది. ఆమె కోసం కుటుంబసభ్యులు ఊరంతా గాలించారు. వారితో పాటు గ్రామస్ధులు కూడా బాలిక కోసం వెతికారు. అయితే పొలంలో ఓ కుక్కల గుంపు ఉండటం వారు గమనించారు. దాంతో అక్కడికి వెళ్లి చూడగా కుక్కలు బాలిక మృతదేహాన్ని కొరుక్కు తింటున్నాయి. ఆ శవాన్ని తన కూతురిదిగా గుర్తించిన తండ్రి కన్నీరుమున్నీరుగా విలపించాడు.
దీని గురించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడి చేరుకున్న పోలీసులు బాలిక శవాన్ని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అక్కడ బాలికపై అత్యాచారం జరిగినట్లు తేలింది. ఈ క్రమంలో బాలిక కుటుంబ సభ్యులు ఓ యువకుడిపై అనుమానం వ్యక్తం చేశారు. అతడిని అదుపులోకి తీసుకొని విచారించడా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. తాను పొలంలో నుంచి వస్తుండగా ఆ చిన్నారి ఆడుకుంటూ కనిపించిందని నిందితుడు తెలిపాడు. మరో వ్యక్తి సాయంతో బాలికను వేరే పొలంలోకి తీసుకువెళ్లి అత్యాచారం చేసి చంపేసినట్లు నిందితుడు వెల్లడించాడు. దీంతో అతనిపై కేసు నమోదు చేసి మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు పోలీసులు. తమ చిన్నారిని దారుణం చంపిన వారిని కఠినంగా శిక్షించాలని బాలిక తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.