Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Income Tax Refund 2026: జూలై 31 గడువు ముగిసేలోపే ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ (ITR) ఫైల్ చేశారా? రిఫండ్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారా? పన్ను చెల్లింపుదారులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే ఘట్టం ఇదే! మరి ఆ డబ్బు మీ బ్యాంకు ఖాతాలో ఎప్పుడు జమ అవుతుంది? మీ అసలు బాధ్యత కంటే ఎక్కువ పన్ను చెల్లించినట్లయితే, ఆదాయపు పన్ను శాఖ మీ రిటర్న్‌ను పరిశీలించి ఆ అదనపు మొత్తాన్ని తిరిగి మీకు రిఫండ్ చేస్తుంది. అయితే, ప్రతిరోజూ బ్యాంకు ఖాతా బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి ముందు మీరు తెలుసుకోవాల్సిన, సరిచూసుకోవాల్సిన ముఖ్య విషయాలు కొన్ని ఉన్నాయి. అలాగే మీ రిఫండ్ స్టేటస్‌ను ఆన్లైన్లో సులభంగా ఎలా ట్రాక్ చేయవచ్చో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
అసలు ఆదాయపు పన్ను రిఫండ్ ఎందుకు వస్తుందో తెలుసా?
మీరు ఫైల్ చేసిన ఐటీఆర్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత, మీ అసలు పన్ను బాధ్యత కంటే ఎక్కువ మొత్తం పన్ను రూపంలో చెల్లించినట్లు తేలితేనే రిఫండ్ వస్తుంది. టీడీఎస్ (TDS), టీసీఎస్ (TCS), అడ్వాన్స్ టాక్స్ లేదా సెల్ఫ్ అసెస్మెంట్ టాక్స్ రూపంలో ఎక్కువ మొత్తంలో పన్ను కట్ అయినప్పుడు లేదా చెల్లించినప్పుడు ఇది జరుగుతుంది. ఇవే కాకుండా వివిధ రకాల మినహాయింపులు (Deductions), టాక్స్ రిలీఫ్‌లు, విదేశీ పన్ను క్రెడిట్ లేదా పన్ను ఒప్పంద ప్రయోజనాలు (Treaty benefits) క్లెయిమ్ చేసినప్పుడు కూడా రిఫండ్ వచ్చే అవకాశం ఉంటుంది.
Also Read
- Jio Recharge: Buy 1 Get 1 ఆఫర్ తో ఈ రెండు ప్లాన్లపై డబుల్ బెనిఫిట్స్..!
- BSNL నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. రూ.172, రూ.184, రూ.190లకే అన్లిమిటెడ్ కాలింగ్..!
- SBI: ప్రవాసులకు గుడ్ న్యూస్.. అమెరికాలో ఎస్బీఐ గ్రాండ్ ఎంట్రీ!
- CM Chandrababu: రూ.500 నోట్లు కూడా రద్దు చేయాలి..! రూ.100, రూ.200 నోట్లు మాత్రమే ఉండాలి..!
అయితే, రిఫండ్ స్టేటస్ ట్రాక్ చేయడానికి కంటే ముందు కొన్ని విషయాలు తనిఖీ చేయడం చాలా అవసరం. మొదటిగా, మీ ఐటీఆర్ విజయవంతంగా ఈ-వెరిఫై (E-Verify) అయ్యిందో లేదో చూసుకోండి. వెరిఫై కాని రిటర్న్ ప్రాసెస్ కాదు, దానికి రిఫండ్ కూడా రాదు. అలాగే మీ పాన్ కార్డ్, ఆధార్‌తో లింక్ అయి ఉండాలి. రిఫండ్ కోసం మీరు ఎంచుకున్న బ్యాంకు ఖాతా ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో ప్రీ-వాలిడేట్ (Pre-validated) అయి ఉండటం తప్పనిసరి. వీటితో పాటు ఫారమ్ 26AS, యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ (AIS), టాక్స్ పేయర్ ఇన్ఫర్మేషన్ సమ్మరీ (TIS) లను సరిచూసుకుని, ఆదాయం లేదా పన్ను వివరాల్లో ఎలాంటి వ్యత్యాసాలు లేవని నిర్ధారించుకోవాలి. విదేశీ పన్ను క్రెడిట్ లేదా ఒప్పంద వెసులుబాటు పొందుతున్నట్లయితే సంబంధిత ఫారమ్ 10F లేదా ఫారమ్ 67 దాఖలు చేశారో లేదో చూడాలి. కొన్నిసార్లు రిఫండ్ ఆలస్యమైతే మీ రిటర్న్‌లో ఏదో తప్పు ఉందనుకుని కంగారు పడక్కర్లేదు. అది ఇంకా ప్రాసెసింగ్‌లో ఉండవచ్చు లేదా బ్యాంక్ ఖాతా వాలిడేషన్ కాకపోవడం వల్ల ఆగి ఉండవచ్చు.
మీ ఐటీఆర్ రిఫండ్ స్టేటస్‌ను ఆన్లైన్లో చాలా సులభంగా ట్రాక్ చేయవచ్చు. దీనికోసం ఆదాయపు పన్ను శాఖ అధికారిక ఇ-ఫైలింగ్ వెబ్సైట్లోకి వెళ్లి, మీ పాన్, పాస్‌వర్డ్‌లతో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ‘e-File’ సెక్షన్‌కు వెళ్లి, ‘Income Tax Returns’ ఎంచుకుని, ‘View Filed Returns’ పై క్లిక్ చేయాలి. అక్కడ సంబంధిత అసెస్మెంట్ ఇయర్‌ను ఎంచుకుని ‘View Details’ పై క్లిక్ చేస్తే మీ రిఫండ్ స్థితి తెలుస్తుంది. ఇవే కాకుండా పోర్టల్‌లోని ‘Services’ విభాగంలో ఉన్న ‘Know Your Refund Status’ ఆప్షన్ ద్వారా కూడా నేరుగా తెలుసుకోవచ్చు. మీ రిఫండ్ ప్రాసెసింగ్‌లో ఉందా, ఇప్పటికే జారీ అయిందా, లేక పాత పన్ను బాధ్యతలకు ఏమైనా సర్దుబాటు (Adjusted) చేశారా అనే వివరాలు అక్కడ స్పష్టంగా కనిపిస్తాయి.
సాధారణంగా ఐటీఆర్ రిఫండ్ సొమ్ము 4 నుంచి 5 వారాల్లోగా బ్యాంకు ఖాతాలో క్రెడిట్ అవుతుంది. అయితే ఈ వ్యవధి అన్ని కేస్లలో ఒకేలా ఉండదు. చిన్న మొత్తం, సాధారణ క్లెయిమ్‌లు చాలా త్వరగా ప్రాసెస్ అవుతాయి. పెద్ద మొత్తంలో రిఫండ్ క్లెయిమ్ చేసినప్పుడు లేదా అదనపు తనిఖీలు అవసరమైనప్పుడు కాస్త ఎక్కువ సమయం పట్టవచ్చు. ఒకవేళ ఐటీఆర్ వెరిఫై చేసినా రిఫండ్ రాకపోతే ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో స్టేటస్ చెక్ చేసుకోవడమే ఉత్తమ మార్గం. పన్ను నిబంధనల ప్రకారం నిర్ణీత గడువు దాటి రిఫండ్ ఆలస్యమైతే, ఆదాయపు పన్ను చట్టాలకు లోబడి పన్ను చెల్లింపుదారునికి ఆ మొత్తంపై అదనంగా వడ్డీ కూడా లభిస్తుంది.
తాజావార్తలు
-
CII Summit: విశాఖ వేదికగా ‘సీఐఐ సమ్మిట్–2026’.. ఏపీ పారిశ్రామిక ప్రగతికి నయా రూట్ మ్యాప్..
-
Group 2 Notification: నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల..
-
Mouli : ‘దొంగ నా కొడకు’ టైటిల్‌పై సెన్సార్ కత్తెర.. ‘DNK’ వెనుక ఉన్న ఆసక్తికరమైన కథ ఇదే!
-
CM Revanth Reddy : పది మంది డీఎస్పీలు చాలు.. ప్రభుత్వ ప్రతిష్ట పెంచినా, తగ్గించినా
-
Under -19 Asia Cup: ఆసియా కప్ 2026.. సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమిండియా..
ట్రెండింగ్
-
Jio Recharge: Buy 1 Get 1 ఆఫర్ తో ఈ రెండు ప్లాన్లపై డబుల్ బెనిఫిట్స్..!
-
BSNL నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. రూ.172, రూ.184, రూ.190లకే అన్లిమిటెడ్ కాలింగ్..!
-
గేర్లు మార్చాల్సిన అవసరం లేకుండానే సులువుగా రైడ్.. KTM 390 Super Duke GT Evo బైక్ లాంచ్‌కు సిద్ధం..!
-
IND vs NZ 3rd ODI: వర్షం మధ్యే టాస్.. న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన భారత్.! 40 ఓవర్లకు కుదింపు..
-
IPL 2027: అతడిని ఆల్‌రౌండర్‌గా అస్సలు అంగీకరించను.. భారత జట్టులో ఎలా అవకాశం వచ్చిందో?