ఆగస్టు 30న అయోధ్య రైల్వే స్టేషన్‌లో మహిళ కానిస్టేబుల్ పై దాడి చేసిన దుండగుల్లో ఒకరు హతమయ్యారు. మరో ఇద్దరికి బుల్లెట్ తగిలింది. ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది. లక్నో స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఎన్‌కౌంటర్ జరిపింది. నిందితులు అజాద్ ఖాన్, విశ్వంభర్ దయాళ్, అనీశ్ ను పట్టుకోవడానికి ప్రయత్నించే క్రమంలో వారిపై కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే నిందుతుల్లో ఒకడైన అనీశ్ పోలీసు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు.
Also Read: USA:” ఆ విషయంలో భారత్ కు ప్రత్యేక మినహాయింపులేమీ లేవు”
అసలేం జరిగిందంటే ఆగస్టు 30న అయోధ్య రైల్వే స్టేషన్‌లో సరయు ఎక్స్‌ప్రెస్ కంపార్ట్‌మెంట్‌లో సీటు విషయంలో నిందితులకు మహిళ కానిస్టేబుల్ తో వివాదం తలెత్తింది. వారి మధ్య గొడవ మరింత ముదిరింది.దీంతో నిందితులు మహిళ కానిస్టేబుల్ పై విచక్షణా రహితంగా దాడి చేశారు. కత్తితో ఆమె ముఖం పై దాడి చేవారు. దీంతో ఆమె పుర్రెకు బలమైన గాయం అయ్యింది. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ రక్తపు మడుగులో పడి ఉన్న ఆ కానిస్టేబుల్ ను పోలీసు అయోధ్య రైల్వే స్టేషన్‌లో సరయు ఎక్స్‌ప్రెస్ కంపార్ట్‌మెంట్‌లో గుర్తించారు. వెంటనే చికిత్స కోసం ఆమెను లక్నోలోని కేజీఎంసీ ఆసుపత్రిలో చేర్పించారు. ఇప్పుడిప్పుడే ఆమె కోలుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కానిస్టేబుల్ ను గాయపరిచి అక్కడి నుంచి పారిపోయిన నిందుతులపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో వారు ఈ రోజు ఉదయం పోలీసుల కంటపడ్డారు. అయితే నిందుతులు పోలీసులను చూడగానే వారిపై కాల్పులు జరపడం మొదలు పెట్టారు. దీంతో పోలీసులు కూడా ఎదరు కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే అనీత్ హతమయ్యాడు. మరో ఇద్దరికి బుల్లెట్ గాయాలయ్యాయి. గాయాలయిన వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.