Gangster Shot Dead: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో మరో గ్యాంగ్స్టర్ ని హత్య చేశారు దుండగులు. మాఫియాడాన్, గ్యాంగ్ స్టర్, ఇటీవల హత్య కేసులో దోషిగా తేలిన ముఖ్తార్ అన్సారీకి అతిముఖ్యమైన సన్నిహితుడిగా పేరొందిని సంజీవ్ మహేశ్వీరీ అలియాస్ సంజీవ్ జీవాను లక్నో కోర్టు ఆవరణలోనే కాల్చి చంపారు. ముజఫర్నగర్కు చెందిన జీవా 2006లో బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్, యూపీ మాజీ మంత్రి బ్రహ్మదత్ ద్వివేది హత్యల కేసులో అరెస్టయ్యాడు. ద్వివేది హత్య కేసులో జీవా,…
Mukhtar Ansari: మాఫియా డాన్, రాజకీయవేత్త, గ్యాంగ్ స్టర్ ముఖ్తార్ అన్సారీని హత్య కేసులో దోషిగా తేల్చింది వారణాసి ఎంపీ ఎమ్మెల్యే కోర్టు. కాంగ్రెస్ నాయకుడిని ఆగస్ట్ 3, 1991లో హత్య చేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. కాంగ్రెస్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే అజయ్ రాయ్ సోదరుడు అవధేష్ రాయ్ ని వారణాసిలోని అజయ్ రాయ్ ఇంటి బయట కాల్చి చంపారు.
Madhya Pradesh: మరికొద్ది క్షణాల్లో తాళి కడితే పెళ్లయిపోతుంది.. సరిగ్గా అదే సమయానికి వరుడు నల్లగా ఉన్నాడని పెళ్లి వద్దంటూ మొండికేసింది వధువు.. పెద్దలు ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో ఏం చేయాలో తెలియక పెళ్లిని రద్దు చేసిన ఘటన ఇటీవల బీహార్లో జరిగింది.
Snake : సాధారణంగా పామంటే అందరికీ భయం.. దాన్ని చూడగానే చాలామంది ఆమడదూరం పరిగెత్తుతారు. కానీ ఉత్తరప్రదేశ్లో ఒళ్ళు గగుర్పొడిచే ఘటన చోటుచేసుకుంది. ఓ చిన్నారి పామును కొరికి చంపేశాడు.
Maharashtra: ప్రస్తుతం సోషల్ మీడియాలు చిన్నారులపై చెడు ప్రభావాన్ని చూపిస్తున్నాయి. తెలిసీ తెలియన ప్రాయంలో స్నేహం, లవ్ వంటివి మైనర్లను ప్రమాదంలోకి నెడుతున్నాయి. తాజాగా జరిగిన ఓ ఘటనే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన 11 ఏళ్ల బాలికకు మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తితో ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడింది. మాటామాటా కలిపి ఉత్తర్ ప్రదేశ్ నుంచి మహారాష్ట్ర వచ్చేలా సదరు బాలికను నిందితుడైన వ్యక్తి ప్రేరేపించాడు.
New Parliament: కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరగుతోంది. కొత్త పార్లమెంట్ లో కార్పెట్ చాలా అందంగా ఉండటంతో ఇప్పుడు దానిపై చర్చ మొదలైంది. 900 మంది కార్మికులు ఏకంగా 10 లక్షల పనిగంటల పాటు నేయడం వల్ల ఈ తివాచీలు తయారయ్యాయి. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ప్రసిద్ధ కళాకారులు ఈ తివాచీ తయారీలో పాలుపంచుకున్నారు. లోక్ సభ, రాజ్య సభ కార్పెట్లపై జాతీయ పక్షి నెమలి, జాతీయ పుష్ఫం కమలం బొమ్మల్ని అద్బుతంగా తీర్చిదిద్దారు.
True Friend : స్నేహితుడి మృతితో ఓ యువకుడు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. అతని మరణాన్ని తట్టుకోలేక ఆ యువకుడు తన స్నేహితుడి అంత్యక్రియల చితిపైకి దూకాడు. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్లో వెలుగు చూసింది.
Kanpur: ఉత్తర్ ప్రదేశ్ లో 100 ఏళ్ల వృద్ధురాలిపై కేసు నమోదైంది. కాటికి కాలి చాపే వయసులో పోలీస్ ఎఫ్ఐఆర్ లోకి ఎక్కింది. సరిగ్గా నడవడం రాని, కళ్లు సరిగ్గా కనిపించని 100 ఏళ్ల వృద్ధురాలు చంద్రకాళి రౌడీయిజం చలాయించింది. ఓ భూతగాదా విషయంలో ఆమెపై మాధురి అనే మహిళ కేసు పెట్టింది. ఈ వివాదంతో రూ.10 లక్షలు ఇవ్వాలని మాధురిని బెదిరించిందనే ఆరోపణలపై పోలీసులు వృద్దురాలి పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చారు.
అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. దీని కోసం అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన జోరుగా కొనసాగుతుంది. వచ్చే సంవత్సరం జనవరిలో రామ మందిరాన్ని ఘనంగా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Car theft: ఓ కారు దొంగతనం ముగ్గురు యువకులను తీవ్ర ఇబ్బందులు పెట్టింది. డబ్బులు సంపాదించాలనుకున్న ముగ్గురు యువకులు కారును దొంగిలించి, చివరకు పట్టుబడ్డారు. అయితే ఇక్కడే ట్విస్ట్ ఉంది. కారునైతే దొంగిలించారు కానీ.. ఆ ముగ్గురిలో ఒక్కరికి కూడా కార్ డ్రైవింగ్ రాదు. సక్సెస్ ఫుల్ గా దొంగతనం చేశారు కానీ.. తమకు డ్రైవింగ్ రాదన్న విషయాన్ని మరిచిపోయారు. చివరకు పోలీసులకు పట్టుబడ్డారు.