Golconda Traffic : గోల్కొండకు రేపు వెళ్లే వారూ.. ఈ రూట్లు గుర్తుపెట్టుకోండి.!
- పంద్రాగస్టు వేడుకల వేళ గోల్కొండలో ట్రాఫిక్ ఆంక్షలు
- ఉదయం 6 నుంచి 12 వరకు రూట్లలో మార్పులు
- పాస్‌లను బట్టి ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు
- సాధారణ వాహనదారులకు ట్రాఫిక్ పోలీసుల సూచనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Golconda Traffic : భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం గోల్కొండ కోటలోని రాణీ మహల్ లాన్స్‌లో ఘనంగా జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలో గోల్కొండ పరిసరాల్లో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు, దారి మళ్లింపులు అమల్లో ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వాహనదారులు ముందుగానే ప్రత్యామ్నాయ మార్గాలు, పార్కింగ్ ప్రాంతాలను తెలుసుకుని ప్రయాణించాలని సూచించారు.
రామదేవ్‌గూడ నుంచి గోల్కొండకు సాధారణ వాహనాలకు నో ఎంట్రీ
ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రామదేవ్‌గూడ నుంచి గోల్కొండ కోట వైపు వెళ్లే రహదారిని సాధారణ వాహనాల రాకపోకలకు మూసివేయనున్నారు. అయితే కార్యక్రమానికి హాజరయ్యే ఆహ్వానితులు తమ కార్ పాస్‌ల ఆధారంగా నిర్దేశించిన మార్గాల్లో ప్రయాణించాల్సి ఉంటుంది.
Also Read
- Congress Councillors: కాంగ్రెస్‌కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
- Vemulawada: శవం ముందు ఆస్తి పంచాయితీ! వేములవాడలో మానవత్వం మంటగలిసిన వైనం..
- CM Revanth Reddy: మనకు ఏ రాష్ట్రంతోనూ పోటీ లేదు, నేరుగా చైనా, జపాన్‌తోనే పోటిపడుతున్నాం..
- Harassment: గురూజీ వలలో సాఫ్ట్వేర్ ఉద్యోగి భార్య.. అంతా చాటింగ్‌ల ద్వారానే..
A, B పాస్ ఉన్నవారు ఇలా వెళ్లాలి
A (గోల్డ్), A (క్రీమ్), B (బ్లూ) పాస్ ఉన్న వాహనాలు సికింద్రాబాద్, బంజారాహిల్స్, మాసబ్ ట్యాంక్, మెహదీపట్నం వైపు నుంచి రేతిబౌలి, నానల్ నగర్, బాలికా భవన్, లంగర్ హౌస్ ఫ్లైఓవర్, టిప్పు ఖాన్ బ్రిడ్జి మీదుగా రామదేవ్‌గూడ జంక్షన్ చేరుకోవాలి. అక్కడి నుంచి కుడివైపు తిరిగి మక్కై దర్వాజా ద్వారా గోల్కొండ కోటకు వెళ్లాలి.
A (గోల్డ్) పాస్: ఫతే దర్వాజా రోడ్డులో పార్కింగ్.
- A (క్రీమ్), B (బ్లూ): గోల్కొండ బస్ స్టాప్ వద్ద పార్కింగ్.
- C (గ్రీన్) పాస్ వాహనాలకు పార్కింగ్ ఎక్కడంటే?
సెవెన్ టాంబ్స్, బంజారా దర్వాజా వైపు నుంచి వచ్చే C పాస్ వాహనాలు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఎడమవైపు తిరిగి ఒవైసీ గ్రౌండ్‌కు చేరుకోవాలి. లంగర్ హౌస్ ఫ్లైఓవర్ వైపు నుంచి వచ్చే వారు ఫతే దర్వాజా, బడా బజార్ వద్ద కుడివైపు తిరిగి GHMC ఐలాండ్ మీదుగా ఒవైసీ లేదా GHMC ప్లే గ్రౌండ్లో వాహనాలను పార్క్ చేయాలి.
D (రెడ్) పాస్.. గోల్కొండ ఏరియా ఆసుపత్రిలో పార్కింగ్
D (రెడ్) పాస్ ఉన్న వాహనాలు షేక్‌పేట్ నాలా, టోలీచౌకి, సెవెన్ టాంబ్స్, బంజారా దర్వాజా మీదుగా గోల్కొండ ఏరియా ఆసుపత్రికి చేరుకోవాలి. అక్కడి ఆసుపత్రి ప్రాంగణంలోనే వాహనాలను పార్క్ చేయాలి.
సాధారణ ప్రజలకు ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు
E (బ్లాక్) పాస్ కింద వచ్చే సాధారణ ప్రజలు లంగర్ హౌస్ ఫ్లైఓవర్ కింద యూటర్న్ తీసుకుని ఫతే దర్వాజా వైపు ఉన్న తవక్కల్ డైవర్షన్ పాయింట్ సమీపంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో వాహనాలు పార్క్ చేయాలి.
షేక్‌పేట్, టోలీచౌకి వైపు నుంచి వచ్చే వారు సెవెన్ టాంబ్స్, డెక్కన్ పార్క్ లేదా గోల్కొండ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ సమీపంలోని ఫుట్‌బాల్ గ్రౌండ్ వద్ద పార్కింగ్ చేసుకోవచ్చు.
వేడుకల తర్వాత తిరుగు ప్రయాణం ఇలా..
- A గోల్డ్, A క్రీమ్, B బ్లూ: మక్కై దర్వాజా–రామదేవ్‌గూడ–లంగర్ హౌస్ మీదుగా వెళ్లాలి.
- C గ్రీన్: బడా బజార్, ఫతే దర్వాజా లేదా బంజారా దర్వాజా, సెవెన్ టాంబ్స్ వైపు వెళ్లాలి.
- D రెడ్: బంజారా దర్వాజా, సెవెన్ టాంబ్స్ మీదుగా వెళ్లాలి.
- E బ్లాక్: తమకు కేటాయించిన పార్కింగ్ ప్రాంతాల నుంచే తిరిగి వెళ్లాలి.
- ఉదయం 10.30 నుంచి సాధారణ వాహనాలకు మళ్లింపులు
వేడుకలు ముగిసే సమయంలో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సాధారణ వాహనాల రాకపోకలకు అదనపు మళ్లింపులు ఉంటాయి. సెవెన్ టాంబ్స్ నుంచి గోల్కొండ వైపు వచ్చే వాహనాలను గోల్ఫ్ క్లబ్, జమాలీ దర్వాజా వద్ద మళ్లిస్తారు. లంగర్ హౌస్ నుంచి వచ్చే వాహనాలను బడా బజార్ జంక్షన్ వద్ద GHMC ఐలాండ్ వైపు మళ్లించనున్నారు.
కార్ పాస్‌లు కనిపించేలా ఉంచాలి
ఆహ్వానితులు తమ వాహనాల విండ్‌షీల్డ్ ఎడమవైపు కార్ పాస్‌ను స్పష్టంగా కనిపించేలా అంటించుకోవాలని పోలీసులు సూచించారు. గోల్కొండ కోటకు వెళ్లే ప్రధాన రహదారులపై ఎక్కడా వాహనాలను పార్క్ చేయవద్దని హెచ్చరించారు. ట్రాఫిక్ పోలీసులు సూచించిన మార్గాలను పాటిస్తూ సహకరించాలని వాహనదారులను కోరారు.
ట్రాఫిక్ అప్డేట్స్: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో తాజా సమాచారం తెలుసుకోవచ్చు. అత్యవసర ప్రయాణ సహాయం కోసం ట్రాఫిక్ హెల్ప్‌లైన్: 9010203626ను సంప్రదించవచ్చు.
తాజావార్తలు
-
Congress Councillors: కాంగ్రెస్‌కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
-
Meerut Blue Drum Murder: మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’.. మరణశిక్ష విధిస్తూ ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించిన న్యాయమూర్తి.!
-
Tecno Spark 50s 5G: టెక్నో Spark 50s 5G లాంచ్ డేట్ ఫిక్స్.. iPhone 18 Pro తరహా Burgundy Red కలర్లో కొత్త ఫోన్!
-
Vangaveeti Radha Joins Jana Sena: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. కండువా కప్పి ఆహ్వానించిన పవన్.. మేయర్ రేసులో..?
-
CJP: ‘‘సంతకాలు చేసి ఉల్లంఘించారు’’.. కాక్రోచ్ నేతలను జైలుకు పంపడానికి కారణాలివే.!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..