Century On Australia Team: ఆస్ట్రేలియాపై వీరవిహారం.. సెంచరీతో కదం తొక్కిన హసన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. రెండో రోజు ఆటలో బంగ్లాదేశ్ యువ ఓపెనర్ తంజీద్ హసన్ బాధ్యతాయుతమైన శతకంతో చెలరేగగా.. మైదానంలో ఆటగాళ్ల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
చాలా సేపటి నుంచి బౌలింగ్ చేసి విసిగిపోయిన ఆస్ట్రేలియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ తన సహనాన్ని కోల్పోయాడు. ఇన్నింగ్స్ 103వ ఓవర్లో బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ మెహదీ హసన్ మిరాజ్ సింగిల్ తీసే క్రమంలో పిచ్ మధ్యలో నుంచి పరుగెత్తుతూ స్టార్క్‌కు ఎదురొచ్చాడు. దీంతో ఆగ్రహానికి గురైన స్టార్క్ “ఇది నా ఫాలో త్రూ, నీది కాదు.. పిచ్ మీద నుంచి తప్పుకో, ఇది బంగ్లాదేశ్ కాదు” అంటూ తీవ్రంగా హెచ్చరించాడు. వెంటనే స్పందించిన ఆన్-ఫీల్డ్ అంపైర్ కుమార ధర్మసేన జోక్యం చేసుకుని మిరాజ్‌ను హెచ్చరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
Also Read
- The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో 'నాని' విజ్ఞప్తి.!
- Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
- Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
- iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
ఈ గొడవను పక్కన పెడితే.. మ్యాచ్‌పై బంగ్లాదేశ్ పూర్తి ఆధిపత్యం చెలాయిస్తోంది. మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాను కేవలం 198 పరుగులకే పరిమితం చేసిన బంగ్లాదేశ్, బ్యాటింగ్‌లో అద్భుత ప్రదర్శన చేసింది. ఓపెనర్ తంజీద్ హసన్ (101) అద్భుత శతకంతో ఇన్నింగ్స్‌కు ప్రధాన బలంగా నిలిచాడు. ఇతనికి తోడుగా మొమినుల్ హక్ (49), కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ షాంటో (84) కీలక భాగస్వామ్యాలు నెలకొల్పడంతో బంగ్లాదేశ్ భారీ స్కోరు సాధించింది.
రెండో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 6 వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసి, ఆస్ట్రేలియాపై ఏకంగా 153 పరుగుల భారీ ఆధిక్యాన్ని (లీడ్) సంపాదించింది. చివరిలో ఆస్ట్రేలియా బౌలర్లు కొత్త బంతితో మూడు వికెట్లు తీసి పుంజుకునే ప్రయత్నం చేసినప్పటికీ, తంజీద్ హసన్ చేసిన ఈ సెంచరీ మ్యాచ్ ఫలితాన్ని మార్చేసేలా బంగ్లాదేశ్‌ను సురక్షితమైన లీడ్‌లో నిలబెట్టింది.
తాజావార్తలు
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. నేడు ఆ రాశుల వారికి లాభాలే లాభాలు!
-
KSLU Transgender Reservation: న్యాయ విద్యలో తొలిసారి ట్రాన్స్జెండర్లకు 1% రిజర్వేషన్.. తొలి యూనివర్సిటీగా KSLU
-
Dont Trouble The Trouble : బాలకృష్ణ వాయిస్ ఓవర్‌తో ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’
-
PM Modi Chintan Shibir 2026: వికసిత్ భారత్ 2047పై ఫోకస్.. నేటి నుంచి ప్రధాని మోడీ ‘చింతన్ శిబిర్’
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!