పెళ్లింట వధువు వరుడిని దేశ ప్రధాని ఎవరో చెప్పమని ప్రశ్నించింది. దానికి వరుడు సమాధానం చెప్పలేకపోవడంతో వధువు తన పెళ్లిని రద్దు చేసుకుని వరుడి తమ్ముడిని పెళ్లాడింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్ జిల్లాలో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది.
Yogi Adityanath: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరోసారి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370 ఎత్తేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్ లో భారత చట్టాలే అమలవుతున్నాయని ఆయన అన్నారు.
బీహార్‌లో టోల్‌ప్లాజా గార్డుగా పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్ కి చెందిన ఓ వ్యక్తిని 50 రూపాయలు దొంగిలించాడన్న అనుమానంతో కొందరు వ్యక్తులు కొట్టి చంపారు. స్థానికంగా ఈ విషయం సంచలనం సృష్టించింది. ఈ ఘటన భోజ్‌పూర్ జిల్లాలోని అర్రా-పాట్నా రహదారిపై కుల్హదియా టోల్‌ప్లాజా వద్ద ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది.
ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. యూపీ రాష్ట్రం మీరట్‌లోని షాజన్‌పూర్‌లో ఓ మామిడి తోటలో ఓ పదేళ్లబాలుడు పెంపుడు కుక్కతో ఆడుకున్నట్లు చిరుత పిల్లతో ఆటలాడుతున్నాడు. ఆ చిరుత కూన మెడలో తాడు కట్టి ఉంది.. ఆ కూన మామిడిచెట్టు కింద ఉండగా బాలుడు దాన్ని పట్టుకోడానికి ప్రయత్నం చేస్తున్నాడు.
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ లో దొంగతనం చేశాడనే అనుమానంతో స్థానికులు ముస్లిం వ్యక్తిని చెట్టుకట్టేసి కొట్టారు. అంతటితో ఆగకుండా గుండు కొట్టించి, జై శ్రీరామ్ నినాదాలు చేయాలని బలవంతం చేశారు. ఈ ఘటన యూపీలోని బులంద్ షహర్ జిల్లాలో జరిగింది.
Bihar-UP Weather Alert: బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రజలు వేడిగాలుల తాకిడికి అస్వస్థతకు గురవుతున్నారు. ఇప్పటివరకు 100 మందికి పైగా వేడిగాలుల కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
Human Sacrifice: కన్నబిడ్డగా చూసుకోవాల్సిన సవితి తల్లే బాలుడి పట్ల దారుణంగా వ్యవహరించింది. తన ఆరోగ్య సమస్యలు తగ్గిపోవడానికి ఓ క్షుద్రపూజారి చెప్పిన విధంగా నాలుగేళ్ల బాలుడిని బలిచ్చింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని అమేథిలోని జామో ప్రాంతంలోని రెహ్సీ అనే గ్రామంలో జరిగింది.
Yogi Government: ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని వాహనాలపై ట్రాఫిక్ చలాన్లను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో పెళ్లి భరాత్ లో రెండు వర్గాలకు చెందిన వ్యక్తులు ఘర్షణ పడ్డారు. ఇరువర్గాల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. అదే సమయంలో ఒకరిపై ఒకరు ఇటుకలు, రాళ్లు రువ్వుకుని, కర్రలతో దాడి చేసుకున్నారు.